మీడియా ముందుకు కల్కి భగవాన్.. వివరాలు ఇవీ..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కల్కి’ ఐటీ దాడుల్లో కీలక పరిణామం ఇది. ఆ ఆశ్రమ వ్యవస్థాపకులైన విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే తాము అందుబాటులో ఉన్నామని వెల్లడించారు.

news18-telugu
Updated: October 22, 2019, 1:13 PM IST
మీడియా ముందుకు కల్కి భగవాన్.. వివరాలు ఇవీ..
కల్కి దంపతులు
  • Share this:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కల్కి’ ఐటీ దాడుల్లో కీలక పరిణామం ఇది. ఆ ఆశ్రమ వ్యవస్థాపకులైన విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే తాము అందుబాటులో ఉన్నామని వెల్లడించారు. ఈ మేరకు మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు. తమ ఆరోగ్యం బాగానే ఉందని, తమ గురించి ఆందోళన చెందవద్దని ఆ వీడియోలో విజయ్‌కుమార్ దంపతులు తెలిపారు. తాము దేశం విడిచి వెళ్లిపోయానని మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని, ఆ కథనాలు నమ్మవద్దని, తాము దేశం విడిచిపోలేదని స్పష్టం చేశారు. కల్కి ఆశ్రమ ప్రధాన కార్యాలయాల్లో యథావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా, భక్తి ముసుగులో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఆరోపణల నేపథ్యంలో ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ దాడుల్లో భాగంగా.. కల్కి ఆశ్రమంలో రూ.లక్షల కోట్లు ఆస్తులు వెలుగుచూసినట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్‌లోనూ కల్కి ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో బంగారు బిస్కెట్లు, ఆస్తులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని ఆశ్రమాల్లో కూడా భారీగా అక్రమాస్తులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలోని ఆశ్రమంలోనే రూ.105 కోట్ల వరకు అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: October 22, 2019, 12:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading