Facebook: అమ్మాయి పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్.. హాయ్! అని పలకరించి..

Fake Facebook: కాకినాడకు చెందిన జగదీశ్ అనే యువకుడు సంధ్య పేరుతో ఫేస్‌బుక్ అకౌంటు క్రియేట్ చేశాడు. విశాఖపట్నంకు చెందిన ఓ యువకుడికి ఛాటింగ్ వల వేసి మాటలతో ముంచెత్తాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 26, 2019, 4:17 PM IST
Facebook: అమ్మాయి పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్.. హాయ్! అని పలకరించి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమ్మాయిల ఫోటో, పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ క్రియేట్ చేస్తారు.. అమాయకులను చూసి హాయ్! అని పలకరిస్తారు.. అమ్మాయి కదా! అనుకొని రిప్లై ఇచ్చారో అంతే సంగతులు. మాటలతో మభ్యపెట్టి, ఛాటింగ్‌తో మురిపించి.. నిండా ముంచేస్తారు. ఇలా అమ్మాయి పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ క్రియేట్ చేసి, ఓ అమాయకుడి వద్ద లక్షలు దండుకున్నారో కొందరు దుండగులు. వివరాల్లోకెళితే.. కాకినాడకు చెందిన జగదీశ్ అనే యువకుడు సంధ్య పేరుతో ఫేస్‌బుక్ అకౌంటు క్రియేట్ చేశాడు. విశాఖపట్నంకు చెందిన ఓ యువకుడికి ఛాటింగ్ వల వేసి మాటలతో ముంచెత్తాడు. నిజంగానే అమ్మాయి కావచ్చు అనుకొని, ఛాటింగ్‌లో మునిగిపోయాడా యువకుడు.

అదే అదనుగా భావించిన జగదీశ్.. తనకు ఓ సమస్య ఉందని, కొంచెం డబ్బు కావాలని, ఏమైనా ఉంటే సాయం చేయాలని ఆ యువకుడికి కోరాడు. సంధ్య సమస్యలో ఉందనుకొన్న ఆ యువకుడు.. డబ్బులు పంపించడం ప్రారంభించాడు. అలా పలు సందర్భాల్లో ఇలాగే చేశాడు. మొత్తంగా రూ.4 లక్షల వరకు అర్పించాడు. అయితే, తాను మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో నిజం బయట పడింది. మోసగాడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.

First published: June 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...