news18-telugu
Updated: November 26, 2019, 11:28 AM IST
మూటలో దీప్తిశ్రీ మృతదేహం
కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీని సవతి తల్లి కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తెలిసిందే. తను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన చిట్టితల్లి చనిపోవడాన్ని కన్నతండ్రి జీర్ణించుకోలేకపోతున్నారు. తన పాపను చూసుకుంటుంది కదా అని రెండో పెళ్లి చేసుకుంటే.. ఆమె ప్రాణాలు తీసిందని కన్నీరుమున్నీరుగా విలపించాడు. దీప్తిని దారుణంగా హత్య చేసిన సవతి తల్లి శాంతికుమారిని నడిరోడ్డుపై ఉరితీయాలని అంటున్నాడు ఆమె భర్త, దీప్తిశ్రీ తండ్రి సూరాడ సత్యశ్యామ్ కుమార్. తానెంతో ప్రేమగా చూసుకునే బిడ్డను కర్కశంగా హత్య చేసిన ఆమెకు కఠిన శిక్ష పడాల్సిందేనంటున్నాడు.
శుక్రవారం దీప్తిశ్రీని స్కూల్ నుంచి కిడ్నాప్ చేసి శాంతికుమారి అత్యంత కిరాతకంగా హతమార్చింది. పాప మెడకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేసింది. ఆ తర్వాత చిన్నారి మృతదేహం మూటకట్టి ఉప్పుటేరులో పడేసింది. శాంతికుమారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో ఆమె నోటివెంటే నిజానిజాలు కక్కించారు. శాంతికుమారిని కఠినంగా శిక్షించాలని... దీప్తిశ్రీ తండ్రితో పాటు.. స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎస్పీ నిందితురాలికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
November 26, 2019, 11:28 AM IST