కడప జిల్లాలో రైలు పట్టాలపై ఆగిపోయిన కారు... ఢీకొట్టిన గూడ్స్ రైలు..

కడప జిల్లాలో రైలు పట్టాలపై ఆగిపోయిన కారును రైలింజన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరుచనిపోయారు.

news18-telugu
Updated: June 27, 2020, 2:45 PM IST
కడప జిల్లాలో రైలు పట్టాలపై ఆగిపోయిన కారు... ఢీకొట్టిన గూడ్స్ రైలు..
కడప జిల్లాలో రైలు పట్టాలపై ఆగిపోయిన కారును ఢీకొన్న రైలింజన్
  • Share this:
మనం తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. కారు కరెక్టుగా రైలు పట్టాల మీదకు వచ్చిన తర్వాత ఆగిపోవడం. అదే సమయంలో డోర్ లాక్ అయిపోవడం. రైలు వేగంగా రావడం వంటి సీన్లు విపరీతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఉంటుంది. నిజజీవితంలో అలాంటి ఘటనలు జరగడం అరుదు. కానీ, ఏపీలోని కడపలో అలాంటి ఘటన జరిగింది. రైలు పట్టాల మీద ఆగిపోయిన కారును గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. కడప జిల్లా ఎర్రగుట్ల మండలం వై. కోడూరు వద్ద గూడ్స్ రైలు ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ దాటుతుండగా ట్రాక్ పై కారు ఆగిపోయింది. ఆ సమయంలోనే భారతీ సిమెంట్ లో వాగిన్లను వదిలి వస్తున్న రైలింజన్ ఆ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరుచనిపోయారు. మరొకరు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి వై.కోడూరుకు చెందిన నాగిరెడ్డిగా గుర్తించారు. రైలింజన్ ఢీకొట్టడంతో కారు కొంతమేర రైలు పట్టాల మీద దూసుకుపోయింది.
First published: June 27, 2020, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading