ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి దుర్మరణం..

ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న కడప జిల్లాకు చెందిన యువకుడు కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.

news18-telugu
Updated: March 3, 2020, 11:36 AM IST
ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి దుర్మరణం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భవిష్యత్తు మీద బోలెడు ఆశలు పెట్టుకొని, దేశం కాని దేశానికి వెళ్లి పై చదువులు చదువుకుంటున్న ఓ తెలుగు విద్యార్థి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న కడప జిల్లాకు చెందిన యువకుడు కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. జిల్లాలోని మాధవరంకు చెందిన శ్రీహరిగా అతడిని గుర్తించారు. మృతి సమాచారాన్ని తోటి విద్యార్థులు శ్రీహరి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడని తల్లడిల్లుతున్నారు. ఘటనతో మాధవరం వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కాగా, శ్రీహరి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ మృతదేహాన్ని వీలైనంత త్వరగా రప్పించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 3, 2020, 11:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading