Home /News /crime /

KADAPA CRIME NEWS WIFE AND HUSBAND SUICIDE WITH TWO CHILDREN S POLICE SUSPECTED CRICEKET BETTING IS MAIN REASON NGS TPT

Crime News: కుటుంబాన్ని బలితీసుకున్న బెట్టింగ్..? అప్పుల భారంతో బిడ్డలతో సహా ఆత్మహత్య

అప్పుల బాధతో కుటుంబం ఆత్మ
హత్య

అప్పుల బాధతో కుటుంబం ఆత్మ హత్య

క్రికెట్ బెట్టింగా ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. కొంతకాలం కిందటి వరకు చాలా సంతోషంగా ఉంటున్న ఆ కుటుంబపై క్రికెట్ బెట్టింగ్ కాటేసింది. అప్పుల ఊబిలో కూరుకుని.. ఆ విషయం ఎవరికీ చెప్పలేక.. బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్నారు భార్య, భర్త.

    అప్పుల భారంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాధ ఘటనకు క్రికెట్ బెట్టింగే కారణమా..?  పోలీసుల విచారణ ఏం చెబుతోంది. తెచ్చిన అప్పులు తలకు మంచి భారంగా మారడం.. త్వరగా తిరిగి చెల్లించాలని అప్పులు ఇచ్చిన వారి వేధింపులు.. దీనికి తోడు క్రికెట్ బెట్టింగ్ లో భారీగా మోసపోయి, దివాళాతీయడం ఆ కుటుంబాన్ని మానసికంగా ఒత్తిడికి గురి చేసింది. ఎవరికీ ఏమి చెప్పలేక.. అప్పులు ఎలా తీర్చాలో తెలియని అయోమయ పరిస్థితులలో మానసికంగా కృంగిపోయి కుటుంబంతో సహా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది కుటుంబం మొత్తం. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. మొదట వివరాలు తెలియకపోవడంతో ఈ సంఘటన పోలీసులకు సవాళ్లతో కూడిన మిస్టరీ గా మారిపోయింది. కానీ కొన్ని గంటల వ్యవధిలో పొరుమామిల్ల సిఐ మోహన్ రెడ్డి, ఎస్సై వరలక్ష్మి మిస్టరీని ఛేదించారు.

    కడపజిల్లా బి కోడూరు మండల పరిధిలోని దిగువ సగిలేరు నదిలో ఓ తల్లి, ఇద్దరు చిన్న పిల్లల మృతదేహాలు నీటిలో తేలడంతో స్థానికులు గమనించి బి కోడూరు పోలీసులకు సమాచారమిచ్చారు. మొదట వీరు ఎవరు, ఎక్కడినుంచి ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారన్న ఆచూకీ లభించలేదు. అగ్నిమాపక సిబ్బందిచే మృతదేహాలను బయటకు తీయించి విచారణ చేపట్టారు పోలీసులు.

    కొన్ని గంటల వ్యవధలో మరో యువకుడి మృతదేహం బయటకు తేలింది. దీంతో ఆ నలుగురు ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానింది.. వారి ఆచూకీ కోసం ఆరా తీశారు. ఆ కుంటంబం పోరుమామిల్ల కు చెందినదిగా గుర్తించారు. పాత పోస్ట్ ఆఫీసు వీధిలో మండలం బాలయ్య ఇంటి దగ్గర వారు నివాసం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆర్య వైశ్య కులానికి చెందిన బళ్ళాని రామకృష్ణ, భార్య అనుష, ఇద్దరు పిల్లలు లిఖిల్ 4 సంవత్సరాలు, కళ్యాణ్ 6 నెలల మగబిడ్డలు గా గుర్తించారు. మృతికి కారణాలు పూర్తిగా తెలియకపోయినా.. స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు.

    రామకృష్ణ ప్రొద్దటూరు కు చెందిన అనూష ను ఎదురు కట్నమిచ్చి వివాహం చేసుకున్నారు. కొంత కాలానికి మామ దగ్గర కొంత డబ్బు తెచ్చుకొని చినబ ఫైనాన్స్ వ్యాపారం, నిత్యావసర వస్తువులును తెచ్చి అంగళ్లకు వేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో వ్యాపారం కోసం లక్షల రూపాయలు అప్పులు తెచ్చారు, ఇచ్చిన డబ్బులు రాలేదు, అప్పులు వడ్డీలు పెరిగి పోయి, అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిళ్లు పెరిగి పోయినట్లు తెలుస్తోంది. ఇదే భార్యాభర్తలను మానసికంగా వేధించాయి. ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోలేక చివరికి భార్యభర్తలు ఇద్దరూ పిల్లలతో కలిసి సగిలేరు నదిలో దూకి ఆత్మహత్య
    చేసుకున్నారు. రామకృష్ణ మంచి స్వభావం కలిగిన వ్యక్తి ఇలా ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఎవరు నమ్మకలేకపోతున్నామంటున్నారు. ఏది ఏమైనా మిస్టరీగా ఏర్పడి ఆత్మహత్య వ్యవహారాన్ని కొన్ని గంటల వ్యవధిలో పొరుమామిల్ల సిఐ మోహన్ రెడ్డి, బి కోడూరు ఎస్సై వరలక్ష్మిని పలువురు అభినందించారు. పొరుమామిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Family suicide, Kadapa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు