ఏపీలో యువతులకు రక్షణ కరువైంది. ప్రేమించినా.. ప్రేమించలేదన్నా కష్టాలు తప్పడం లేదు.. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పిన వారిని నమ్మి అందుకు అంగీకరిస్తే.. కోరికలు తీర్చుకుని మొహం చాటేస్తున్నారు. తరువాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ప్రేమించడం ఇష్టం లేదని తెగేసి చెప్పినా వదలడం లేదు.. ప్రేమికులు అని చెప్పుకునే వారిలో ఉన్మాది బయటకు వస్తున్నాడు. తమను ప్రేమించలేదనే ఆవేశంతో ఉన్మాదానికి ఒడికి గడుతున్నారు. తాజాగా సీఎం జగన్ సొంత జిల్లా కడపలో అమానుష ఘటన చోటు చేసుకుంది. బద్వేల్ మండలం చింతలచెరువులో యువతి గొంతుకోశాడు ఉన్మాది చరణ్. మృతురాలు బద్వేల్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి శిరీషగా పోలీసులు గుర్తించారు.
అయితే ఇద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారానికి సంబంధించి వివాదం ఉందని.. ఈ ఘాతుకానికి ఇదే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు చరణ్‌ను గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ నిందితుడు ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: సీఎం సొంత జిల్లాలో టెన్షన్ టెన్షన్.. నిప్పురాజేసిన టిప్పు సుల్తాన్ విగ్రహం
కడప జిల్లాలోని బద్వేలు మండలం చింతలచెరువుకి చెందిన 19 ఏళ్ల అనే యువతి తనను ప్రేమించట్లేదని.. ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చాలా కాలంగా తనను ప్రేమించాలని.. తనతోనే ఉండాలంటూ చరణ్ వెంటపడుతున్నాట్టు శిరీష స్నేహితులు చెబుతున్నారు. అయినా అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లిన చరణ్.. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. అందుకు శిరీష నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన యువకుడు అతి కిరాతకంగా యువతి గొంతు కోసేశాడు. విషయం గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూసింది.
ఇదీ చదవండి: శనివారం అంటే భయం భయం.. తెల్లవారిదంటే టీడీపీ నేతలకు టెన్షన్.. ఎందుకో తెలుసా
అయితే.. ఈ ఘటన జరిగిన తర్వాత చరణ్ కూడా పురుగుల మందు తాగినట్లు సమాచారం. చరణ్‌ను పట్టుకుని గ్రామస్తులు, యువతి బంధువులు చితకబాదారారు. తరువాత పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆ ప్రేమోన్మాదిని బద్వేల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే చరణ్ ఉన్నాడు. శిరీష మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.