కాచిగూడలో లోకో పైలెట్ ఉద్దేశపూర్వకంగానే ట్రైన్ నిర్లక్ష్యంగా నడిపాడా?

MMTS Train Accident : నిర్లక్ష్యంగా రైలును నడిపి... కాచిగూడలో ప్రమాదానికి కారణమైన లోకో పైలెట్ శేఖర్‌పై 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

news18-telugu
Updated: November 12, 2019, 12:31 PM IST
కాచిగూడలో లోకో పైలెట్ ఉద్దేశపూర్వకంగానే ట్రైన్ నిర్లక్ష్యంగా నడిపాడా?
కాచిగూడలో లోకో పైలెట్ ఉద్దేశపూర్వకంగానే ట్రైన్ నిర్లక్ష్యంగా నడిపాడా?
  • Share this:
Kachiguda Train Accident : కాచిగూడ రైలు ప్రమాదంపై దర్యాప్తు వేగం అందుకుంది. ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్న MMTS ట్రైన్ లోకో పైలెట్ చంద్రశేఖర్‌ స్టేట్‌మెంట్ నమోదుచేసిన పోలీసులు... నిర్లక్ష్యంగా రైలు నడిపి... ప్రమాదానికి కారణమైనందుకు... ఆయనపై 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రశేఖర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం... అతను ఒక ట్రాక్‌లోకి ట్రైన్‌ను తీసుకెళ్లాల్సి ఉండగా... అలా చెయ్యకుండా నిర్లక్ష్యం వహించి... హంద్రీ ఎక్స్‌ప్రెస్ వస్తున్న రూట్‌లో ట్రైన్ నడిపినట్లు తెలిసింది. ఐతే... హంద్రీ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ జాగ్రత్తపడి... సడెన్ బ్రేక్ వెయ్యడంతో... ప్రమాద తీవ్రత తగ్గింది. అదే ఆ డ్రైవర్ సడెన్ బ్రేక్ వెయ్యకపోయి ఉంటే... రెండు రైళ్లూ అత్యంత తీవ్రంగా ఢీకొట్టుకొని... ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని తెలిసింది.

చంద్రశేఖర్ ఉద్దేశపూర్వకంగా MMTSను అలా నడిపాడా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. అతను ఈ నిర్లక్ష్యపు చర్యకు ఎందుకు పాల్పడ్డాడో పోలీసులు తెలుసుకుంటున్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి... రిపోర్ట్ ఇస్తామంటున్నారు. రైల్వే పోలీసులతోపాటూ... రైల్వే ఎంక్వైరీ కమిషన్ కూడా ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతోంది.

ప్రస్తుతం చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉంది. శ్వాస సరిగా తీసుకోలేకపోతున్నాడు. దీనిపై కేర్ ఆస్పత్రి వర్గాలు మెడికల్ న్యూస్ ఇవ్వాల్సి ఉంది. ఉదయం కాళ్లకు సంబంధించి ఓ సర్జరీ చేసిన డాక్టర్లు... మధ్యాహ్నం మరో సర్జరీ చెయ్యనున్నారు. చంద్రశేఖర్ రెండు కాళ్లూ తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. అతను నడవలేకపోతున్నట్లు తెలిసింది. పక్క ఎముకలు కూడా దెబ్బతిన్నాయి.

మరోవైపు కాచిగూడలో ట్రాక్స్‌ పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 300 మంది రైల్వే కార్మికులు ఈ పనులు చేస్తున్నారు. సాయంత్రానికి అన్నీ పూర్తవుతాయని తెలుస్తోంది. 

Pics : అందం, అభినయాల కలయిక ప్రియాంక నల్కర్ఇవి కూడా చదవండి :

యూట్యూబ్ రూల్స్ ఛేంజ్... వీడియో క్రియేటర్లకు షాక్..!

Food : ఉసిరి రైస్... కార్తీకమాసం స్పెషల్

Diabetes Tips : ఈ ఆహారం తినండి... డయాబెటిస్‌కి చెక్ పెట్టండి


Health Tips : డ్రాగన్ ఫ్రూట్స్‌కి ఆ పేరెలా వచ్చింది... ఇదీ చరిత్ర?


Food : కరకరలాడే ఉల్లి గారెలు... ఇలా తయారుచెయ్యండి
First published: November 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు