దిశా కేసులో కీలక నిర్ణయం... ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

Justice for Disha: దీంతో హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారికంగా హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

news18-telugu
Updated: December 4, 2019, 4:08 PM IST
దిశా కేసులో కీలక నిర్ణయం... ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
హైకోర్టు
  • Share this:
షాద్‌నగర్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార కేసుపై ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేయాలంటూ ప్రజా, మహిళ సంఘాల  నుంచి డిమాండ్ వ్యక్తమవుతోది. దీంతో ఈ నేపథ్యంలో హైకోర్టుకు ప్రభుత్వం లేఖ రాసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై హైకోర్టు లా సెక్రటరీ సంతోష్ లేఖ రాశారు. దీంతో హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుపై న్యాయస్థానం అనుకూలంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలో కోర్టుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసుకునేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది హైకోర్టు. ఇవాళ దిశ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో హోమంత్రి మహమూద్ అలీతో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు. దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్చించారు. తెలంగాణలో మహిళలకు ఇలాంటి ఘటనపట్ల అవగాహన కల్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల పట్ల కూడా చర్చించారు.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>