• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • JUST TWO BEFORE WEDDING 19 YEAR OLD GIRL HER FATHER SHOT DEAD BY STALKER BN

యూపీలో ఘోరం.. వేరొకరిని పెళ్లి చేసుకుంటుందని యువతి, తండ్రిని కాల్చి చంపి..

ప్రతీకాత్మక చిత్రం

మరో రెండు రోజుల్లో పెళ్లి. అయితే పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలను యువతి ఇంటిలో నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో సదరు యువకుడు తన స్నేహితులతో కలిసి యువతి ఇంటికి వచ్చాడు.

  • Share this:
    సరిగ్గా మరో రెండు రోజుల్లో పెళ్లి. తనకు కాబోయే భర్త గురించి ఆ యువతి కోటి కలలు కంటోంది. ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇళ్లంతా పెళ్లి సందడి నెలకొంది. కానీ అంతలోనే ఓ యువకుడు తనను కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటుందని ఆగ్రహించి యువతి కుటుంబంపై కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో యువతితో పాటు ఆమె తండ్రి చనిపోగా, సోదరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన జూన్ 27న జరగ్గా, జూలై 3న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీలోని మీరట్‌కు చెందిన యువకుడు తనను పెళ్లి చేసుకోవాలంటూ అదే ప్రాంతానికి చెందిన యువతి(19) వెంటపడేవాడు. కానీ అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు.

    ఈ క్రమంలోనే సదరు యువతికి వేరే వ్యక్తితో వివాహం కుదిరింది. మరో రెండు రోజుల్లో పెళ్లి. అయితే పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలను యువతి ఇంటిలో నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో సదరు యువకుడు తన స్నేహితులతో కలిసి యువతి ఇంటికి వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకోకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటావా అంటూ ఆగ్రహంతో తుపాకీతో యువతిని కాల్చి చంపాడు.

    అడ్డు వచ్చిన ఆమె సోదరుడు, తండ్రిపైకి కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన యువతి తండ్రి, సోదరుడిని కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో యువతి సోదరుడు చికిత్స పొందుతుండగా, తండ్రి మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడితో పాటు అతడి తల్లి, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
    Published by:Narsimha Badhini
    First published: