Home /News /crime /

JUST THREE DAYS AFTER THE MARRIAGE NEWLY MARRIED WOMAN FACING HARASSMENT BY HER HUSBAND AND IN LAWS SSR

Newly Married: జూన్ 21న పెళ్లయింది.. జూన్ 24న హాస్పిటల్‌లో చావుబతుకుల మధ్య నవవధువు.. ఏమైందంటే..

ఆసుపత్రిలో బాధితురాలు

ఆసుపత్రిలో బాధితురాలు

ఉస్మాన్‌పూర్ గ్రామానికి చెందిన సునీల్ అనే యువకుడికి, సహస్వన్ కొత్వాలి తాలూకాలోని ముదారి సిద్ధార్పూర్ గ్రామానికి చెందిన ఊర్మిళకు జూన్ 21న వివాహమైంది. ఈ జంటది పెద్దలు కుదిర్చిన వివాహమే. కట్నకానుకలు ముట్టజెప్పి ఊర్మిళ తల్లిదండ్రులు ఆమె పెళ్లి జరిపించారు.

ఇంకా చదవండి ...
    బడున్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. యూపీలోని బడున్ జిల్లాలోని జరీఫ్‌నగర్‌లో పెళ్లయిన మూడు రోజులకే ఓ నవ వధువుకు చేదు అనుభవం ఎదురైంది. పెళ్లయిన మూడో రోజే భర్త తనలోని సైకోను నిద్రలేపాడు. అత్తారింటికి వచ్చిన భార్యకు నరకం చూపించాడు. భార్యతో గొడవపడి ఆమెపై కర్రతో దాడి చేశాడు. ఆ తర్వాత.. మరింత పైశాచికంతో ఇనుపకడ్డీని కాల్చి ఆమె ఒళ్లంతా వాతలు పెట్టాడు. ఆ మృగాడి దాడి కారణంగా తన ప్రైవేట్ పార్ట్‌లో 7 కుట్లు పడినట్లు బాధితురాలికి వైద్యం చేసిన డాక్టర్లు తెలిపారు. బడున్ జిల్లాలోని జిల్లా మహిళా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ నవ వధువు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని జరీఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఉస్మాన్‌పూర్ గ్రామానికి చెందిన సునీల్ అనే యువకుడికి, సహస్వన్ కొత్వాలి తాలూకాలోని ముదారి సిద్ధార్పూర్ గ్రామానికి చెందిన ఊర్మిళకు జూన్ 21న వివాహమైంది. ఈ జంటది పెద్దలు కుదిర్చిన వివాహమే. కట్నకానుకలు ముట్టజెప్పి ఊర్మిళ తల్లిదండ్రులు ఆమె పెళ్లి జరిపించారు.

    పెళ్లయిన తర్వాత అత్తారింట్లో అడుగుపెట్టిన ఊర్మిళకు వివాహమైన మూడో రోజు నుంచే అత్తింట్లో వేధింపులు ఎదురయ్యాయి. ఆమె అత్తమామలతో పాటు భర్త సునీల్ కూడా జూన్ 24న ఆమెను అకారణంగా తిట్టి, కొట్టి హింసించారు. సునీల్ పశువులా మారి.. విచక్షణ మరచి ఇనుప కడ్డీ మంటల్లో కాల్చి ఊర్మిళ ప్రైవేట్ పార్ట్స్‌లో అంటించాడు. కాలిన గాయాలతో అరుస్తూ ఊర్మిళ విలవిలలాడిపోయింది. తన కూతురిని అత్తింటి వారు వేధించిన విషయం ఊర్మిళ తండ్రికి తెలిసింది.

    ఇది కూడా చదవండి: Extra Marital Affair: దారుణాన్ని కళ్ల ముందుంచిన వదినమరిది వివాహేతర సంబంధం.. మంచంపై కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే..

    కూతురిని ఆసుపత్రిలో చేర్పించి.. ఆమె భర్త సునీల్‌పై, అత్తామామలపై ఊర్మిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బడున్ ఎస్‌ఎస్‌పీ సంకల్ప్ శర్మ ఈ ఘటనపై స్పందిస్తూ.. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు జరీఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎ‌ఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ఊర్మిళ భర్త సునీల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఊర్మిళ మెడికల్ రిపోర్ట్‌ను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Domestic Violence, Marriage, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు