news18-telugu
Updated: February 15, 2020, 2:10 PM IST
తెలంగాణలో దారుణం... బారాత్లో డాన్స్ వేస్తూ వరుడు మృతి
అప్పటికే కొద్ది నిమిషాల వరకు అక్కడున్న వాళ్లంతా ఫుల్ ఉంజాయ్ చేశారు. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక నిర్వహించారు. చుట్టాలుబంధువులతో కల్యాణ మండపమంతా కళకళలాడింది. వారి ఆనందం చూసి భగవంతుడికే కన్నుకుట్టిందే ఏమో కానీ... హఠాత్తుగా ఆ సంబరాల్లో ఏకంగా పెళ్లి కొడుకు ప్రాణాలే తీసుకెళ్లిపోయాడు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ ఘటనతో అక్కడున్నవాళ్లందరి ఆనందం క్షణాల్లోనే ఆవిరైపోయింది. ఈ విషాదకరమైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బ్రాహ్మణగల్లి లో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన గంటల్లోనే పెళ్లి కొడుకు గుండెపోటుతో మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బోధన్ పట్టణానికి చెందిన గణేష్ అనే యువకుడికి సాలూరు గ్రామానికి చెందిన స్వప్నతో శుక్రవారం వివాహం జరిగింది. పెళ్లి వేడుకలు ముగిసిన అనంతరం పెళ్లి భరత్ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకు గణేష్ తన స్నేహితులతో కలిసి పెళ్లి భరత్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆనంద సమయంలోనే గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. అతని స్నేహితులు కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పెళ్లి మండపం లోనే చావు గంటలు మోగడం తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లి కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించింది.
Published by:
Sulthana Begum Shaik
First published:
February 15, 2020, 12:25 PM IST