ఢిల్లీలో (Delhi) న్యాయమూర్తి భార్య ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఆయన.. సాకేత్ కోర్టు లో న్యాయమూర్తిగా (Judge) పనిచేస్తుంటారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆయన భార్య మార్కెట్ కు వెళ్లింది. అర్ధరాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. అయితే, తొలుత ఆయన, ఆమె సోదరుడి ఇంటికి వెళ్లి ఉండవచ్చని భావించారు. ఆమెకు ఎన్నిసార్లు కాల్ చేసిన (Missing) ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది. తెల్లవారు జామున చూసిన ఆమె తిరిగి రాలేదు. దీంతో న్యాయమూర్తి తన భార్య కన్పించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జడ్జీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరానలు (CC Footage) జల్లెడపట్టారు. చివరగా.. 42 ఏళ్ల మహిళ ఒక ఆటోలో ఎక్కినట్లు గుర్తించారు. ఆటో నెంబర్ ను గుర్తించి, అతడిని అదుపులోనికి తీసుకొని విచారించారు. అతను.. మహిళను రాజ్ ఫూర్ ఖుర్ద్ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు తెలిపాడు. అక్కడ మహిళ సోదరుడి ఫ్లాట్ ఉంది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఫ్లాట్ బయట నుంచి లాక్ చేసి ఉంది.
అధికారులు తలుపులు పగల కొట్టి చూశారు. అక్కడ జడ్జీ భార్య.. సీలింగ్ కు ఉరివేసుకుని (suicide) విగత జీవిగా ఉంది. దీంతో అధికారులు ఖంగుతిన్నారు. జడ్జీకి సమాచారం అందించారు. ఘటన ప్రదేశంలో మూడు సూసైడ్ నోట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అనుమానస్పద మృతి కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా తెలంగాణలో ఒక వివాహిత భర్తతో గొడవలు పడి ఆత్మహత్యకు పాల్పడింది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన కె రమేష్‌కు మంచిర్యాల జిల్లాకు చెందిన వంగ భారతికి గతేడాది డిసెంబర్లో వివాహం జరిగింది. భారతి స్త్రీ వైద్య నిపుణురాలు కాగా.. రమేష్ పిల్లల డాక్టర్. వీరు గత ఆరు నెలలుగా సుర్యోదయ నగర్లో నివాసం ఉంటున్నారు. పెళ్లైనా (After marriage) తర్వాత కొన్ని నెలల పాటు వీరి జీవితం బాగానే సాగింది. అయితే ఇటీవల భారతిని భర్త రమేశ్‌కు గొడవలు మొదలయ్యాయి. ఇద్దరం కలిసి హాస్పిటల్ పెడదామని.. ఇందుకోసం అదనపు కట్నం తీసుకురావాలని భారతిని రమేష్ (ramesh) ఒత్తిడి చేశాడు. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా.. మద్యం తాగొచ్చి హింసించేవాడు. ఈ క్రమంలోనే భారతి (Bharati) 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. అయితే పెద్దలు సర్దిచెప్పడంతో వారం క్రితం తిరిగి భర్త వద్దకు వచ్చింది.
శుక్రవారం రాత్రి భారతి తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో వారు అల్లుడు రమేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో రమేష్ తాను ఆసుపత్రిలో ఉన్నానని.. ఇంటికి వెళ్లి చెబుతునానని అన్నాడు. ఆ తర్వాత రమేష్.. భారతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆమె చనిపోయిందని (Suicide) చెప్పాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు అక్కడకు చేరుకని వివరాలు సేకరించారు. భారతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Delhi, Woman suicide