ఈ భూమి మీద మనిషి బతికేది వందేండ్లు. ఆ వ్యక్తి అదృష్టం భావుంటే మరో పదో, ఇరవై ఏండ్లో అతి కష్టం మీద బతుకుతాడు. ఇక ఎవరైనా వ్యక్తి నేరం చేసినట్లు రుజువైతే అతడికి విధించే గరిష్ట శిక్ష.. జీవితకాల ఖైదు (ఉరిశిక్ష తప్పిస్తే..). కానీ అమెరికాలో ఒక వ్యక్తికి 600 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తూ.. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు సంచలన తీర్పునిచ్చారు. యూఎస్ లోని టుస్కాలూసలో జిల్లా న్యాయస్థానం ఈ సంచలన తీర్పు వెలువరించింది. ఇంతకీ అతడు చేసిన అంతటి నేరమేమిటంటే..
టుస్కలుసకు చెందిన మాథ్యూ టైలర్ మిల్లర్ (32) కు ఈ శిక్ష పడింది. ఆయన ఇద్దరు బాలికలను రేప్ చేసినందుకు గానూ ఇంత భారీ శిక్ష విధించారు. ఇద్దరు మైనర్ బాలికలతో లైంగిక సంబంధం కలిగి ఉండటమే గాక.. 2014 నుంచి 2019 దాకా చిన్న పిల్లలను లైంగికంగా వాడుకునేవాడని ఆరోపణలున్నాయి. బాలికలు అతడితో లైంగికంగా గడపడానికి వారిని ప్రలోబాలకు గురిచేసేవాడని.. ఆయనే ఒప్పుకున్నాడు. ఈ ఘటనలు జరిగినప్పుడు బాధితుల వయసు ఆరేండ్ల నుంచి పన్నెండ్ల లోపే ఉంటుందని అతడు చెప్పాడు.
ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులకు బలమైన రుజువులు కూడా కనిపించాయి. అతడి మొబైల్, ల్యాప్ ట్యాప్ లలో సుమారు 100 కు పైగా అశ్లీల చిత్రాలు ఉన్నాయి. అవన్నీ చిన్న పిల్లలతోనే చిత్రీకరించినవి కావడం గమనార్హం. మిల్లెర్ తన నేరాన్ని 2019 అక్టోబర్ లో అంగీకరించాడు.
కాగా, మిల్లెర్ పై ఇప్పటికే అమెరికాలో సొడొమీ (అమెరికాలో లైంగిక చట్టాలు) చట్టాల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 12 సంవత్సరాల కంటే తక్కువున్న పిల్లలతో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే.. వారిపై ఈ చట్టాల కింద కేసులు మోపుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Child rape, Crime news, Us news