అసహజ సెక్స్ కోసం వేధింపులు..జడ్జిపై కేసు పెట్టిన భార్య

అసహజమైన సెక్స్ కోసం తాను డిమాండ్ చేస్తూ తనను శారీరక, మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ మహారాష్ట్రలో ఓ జడ్జిపై ఆయన భార్య కేసు పెట్టింది. జడ్జితో పాటు ఆయన కుటుంబ సభ్యులు తన ప్రైవేటు ఫోటోలను వారి మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారని ఆరోపించింది.

news18-telugu
Updated: August 2, 2020, 10:46 AM IST
అసహజ సెక్స్ కోసం వేధింపులు..జడ్జిపై కేసు పెట్టిన భార్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అసహజమైన సెక్స్ కోసం డిమాండ్ చేస్తూ తనను శారీరక, మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ మహారాష్ట్రలో ఓ జడ్జిపై ఆయన భార్య కేసు పెట్టింది. జడ్జితో పాటు ఆయన కుటుంబ సభ్యులు తన ప్రైవేట్ ఫోటోలను వారి మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారని ఆరోపించింది. దీనికి సంబంధించి జడ్జితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకిచ్చిన తన ఫిర్యాదులో కోరింది. దీనిపై జడ్జితో పాటు ఆయన తల్లిదండ్రులు, సోదరి, సోదరి భర్తపై వరూద్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 498ఏ, 377, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందిన జడ్జి...తన భార్య చేసిన ఈ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవంలేదని, పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నాగ్‌పూర్‌‌లోని సిట్టింగ్ సెషన్స్ కోర్టులో జడ్జిగా పనిచేస్తున్న ఆయన...బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఎదుట క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు దురుద్దేశపూర్వకంగా ఆమె ఈ ఆరోపణలు చేస్తోందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను విచారించిన ద్విసభ్య బెంచ్...జడ్జికి తాత్కాలిక ఉపసమనం కలిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు అనుమతి లేకుండా సదరు జడ్జిపై ఛార్జ్‌షీట్ నమోదుచేయొద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందిన జడ్జి...తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది.

విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్న 13 మాసాల తర్వాత జడ్జిపై ఆమె ఈ రకమైన నిరాధార ఆరోపణలు చేస్తోందని, దీన్ని పరిగణలోకి తీసుకోవాలని జడ్జి తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇది పూర్తిగా వివాహ వివాదానికి సంబంధించినదిగా పేర్కొన్నారు. 2018 సెప్టెంబర్ నుంచి జడ్జి, ఆయన భార్య ఇద్దరూ విడిగా ఉంటున్నారని గుర్తు చేశారు. గత ఏడాది విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకోగా...  13 మాసాల క్రితం తన క్లైంట్ నేరానికి పాల్పడినట్లు ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం అవాస్తవం, కల్పితం, నమ్మసక్యంకానిదని కోర్టుకు తెలిపారు.
Published by: Janardhan V
First published: August 2, 2020, 10:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading