షాకింగ్... సీరియల్ కిల్లర్ జోలీ... కాలేజీ రోజుల్లో ఏం చేసేదో తెలుసా...

Kerala Serial Killer Jolly Case : 1992-1995 మధ్య జోలీ డిగ్రీ చదివింది. కాలేజీ రోజుల్లోనే ఆమె మూడు లవ్ ఎఫైర్లు నడిపిందంటే కేరక్టర్ ఎంత డేంజరస్సో అర్థం చేసుకోవచ్చు.

news18-telugu
Updated: October 13, 2019, 11:26 AM IST
షాకింగ్... సీరియల్ కిల్లర్ జోలీ... కాలేజీ రోజుల్లో ఏం చేసేదో తెలుసా...
సీరియల్ కిల్లర్ జోలీ... కాలేజీ రోజుల్లో ఏం చేసేదో తెలుసా...
  • Share this:
Kerala Serial Killer Jolly Case : కేరళలో... ఒకే కుటుంబంలో ఆరుగురిని చంపి... మరో ముగ్గురి హత్య కేసుల్లో నిందితురాలిగా ఉన్న జోలీ జోసెఫ్‌ని కస్టడీలోకి తీసుకొని... గత చరిత్రను తవ్వుతున్నారు దర్యాప్తు అధికారులు. తాజాగా ఆమె ఎక్కడెక్కడ చదువుకుందో అక్కడకు తీసుకెళ్లారు. స్థానికులు, చుట్టుపక్కల వాళ్లు, స్కూల్ అధికారులు అందరూ ఆమె హత్యలు చేసిందంటే నమ్మలేకపోతున్నారు. 1992-1995 మధ్య జోలీ డిగ్రీ చదివింది. నెడుంకందం MES కాలేజీలో జోలీ ఎలా చేసిన ఘనకార్యాలు ఇప్పుడు బయటికొస్తున్నాయి. కాలేజీ హాస్టల్‌లో తోటి విద్యార్థిని చెవు రింగులను జోలీ చోరీ చేసింది. అప్పట్లో అసలు విషయం తెలిసి... ఆమెను హాస్టల్‌ నుంచీ బయటకు పంపేశారు. అప్పటి నుంచీ ఆమె డే స్కాలర్‌గా చదువుకుంది.

ఆ తర్వాత జోలీని కుటుంబసభ్యులు సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేర్చారు. క్లాస్‌లో వెనక బెంచీలో కూర్చునే జోలీ... సైలెంట్‌గా ఉండేది. అప్పట్లో జయదీప్‌ ఆమె క్లాస్‌మేట్. అంతే కాదు... జోలీకి రెండు, మూడు లవ్ ఎఫైర్స్ కూడా ఉండేవి. ఉదయం 9 గంటలకు క్లాస్ మొదలయ్యేది. జోలీ 8 గంటలకే వచ్చేసేది. తీరా క్లాస్ మొదలయ్యాక... క్లాస్‌లో పెద్దగా స్టూడెంట్స్ ఉండేవాళ్లు కాదు. సినిమాలకూ, షికార్లతో పోయేవాళ్లు.

జోలీ అప్పటి ఫ్రెండ్స్‌తో గత నెల వరకూ ఫోన్లలో, వాట్సాప్‌లో కాంటాక్ట్‌లో ఉంది. జోలీతో సిన్సియర్‌గా ఫ్రెండ్షిప్ చేసిన ఓ ముంబై ఫ్రెండ్... ఆమె చేసిన హత్యల విషయం తెలిసి షాకయ్యారు. జోలీకి చెందిన ఓ గర్ల్‌ఫ్రెండ్‌ని ఇటీవలో పాలా (కేరళ) పోలీసులు అరెస్టు చేశారు. ఓ జాబ్ ఫ్రాడ్‌లో ఆమె నిందితురాలు. ఆమె భర్త కొన్ని నెలల కిందట అనుమానాస్పద స్థితిలో మరణించారు. అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందని ఆమె స్థానికులకు తెలిపింది. స్నేహితులు మాత్రం అతను సూసైడ్ చేసుకున్నాడని అన్నారు. ఆమె జోలీ ఫ్రెండ్ కావడంతో... ఇప్పుడా మరణంపై అనుమానాలు మరింత పెరిగాయి.

కాలేజీ తర్వాత కూడా జోలీ చాలా మందితో స్నేహాలు చేసింది. వాళ్లలో చాలా మంది క్లోజ్ రిలేషన్‌షిప్ కలిగి ఉండేవాళ్లు. ఐతే... ఇప్పుడు వాళ్లలో చాలా మంది జోలీ ఎవరో గుర్తులేదంటున్నారు. దయచేసి తమను ఏ ప్రశ్నలూ అడగవద్దని పోలీస్ అధికారులను వేడుకుంటున్నారు. ఓవరాల్‌గా చూస్తే... జోలీ తన కాలేజీ రోజుల్లో కూడా అడ్డమైన పనులూ చేసేదని అర్థమవుతోంది. కాలం గడిచేకొద్దీ ఆమెలో నెగిటివ్ థాట్స్ మరింత పెరిగాయి. ఫలితంగా ఆరు హత్యలు, మరో మూడు హత్యల్లో ఆమె హస్తంపై అనుమానాలు కలుగుతున్నాయి.


Pics : చూపులతోనే పిచ్చెక్కిస్తున్న రిద్దికుమార్

ఇవి కూడా చదవండి :

Health Tips : ప్యాషన్ ఫ్రూట్ ఐస్ టీ... రుచికి రుచి... ఆరోగ్యానికి ఆరోగ్యం

Health Tips : బరువు తగ్గాలా... పార్స్‌లీ టీ తాగండి...

Health Tips : టైప్-2 డయాబెటిస్ తగ్గేందుకు ఈ ఆహారం తినండి...

Health Tips : బరువు తగ్గాలా... కుంకుమ పువ్వుతో ఇలా చెయ్యండి...
Published by: Krishna Kumar N
First published: October 13, 2019, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading