Sexual Favour: లీవ్ కావాలంటే కోరిక తీర్చమన్న ఆఫీసర్.. ఉతికారేసిన ఉద్యోగులు

ప్రతీకాత్మక చిత్రం

లైంగిక వేధింపుల (sexual harassment) కు పాల్పడిన ఆ ప్రభుత్వ అధికారిని ఉతికి ఆరేశారు.. ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తన సోదరుడి కోసం లీవ్ అడిగిన మహిళా ఉద్యోగిని పై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం సంచలనం సృష్టిస్తోంది.

  • News18
  • Last Updated :
  • Share this:
రాజస్థాన్ లోని (Rajastan) జోధ్ పూర్ (Jodhpur) మునిసిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఆమె, తన సోదరుడు ఆసుపత్రిలో కొన ఉసురుతో ఉన్నాడని, తాను ఆఫీసుకు రాలేనని, లీవు కావాలని తనపై అధికారికి కాల్ చేసింది. అంతే ఇదే చాన్స్ అని సదరు అధికారి రెచ్చిపోయి.. సెలవుతో పాటు సోదరుడు చికిత్స అయ్యే ఖర్చును ఇస్తానని, ఇందుకు తాను పెట్టే ఒకే ఒక కండిషన్ అంగీకరించాలని, తన కోరిక తీర్చాలని ఫోన్ లో చెప్పాడు. దీంతో తనకు ఆ దౌర్భాగ్యం పట్టలేదంటూ తేల్చి చెప్పింది. ఆతరువాత ఆమె సోదరుడు మరణించాడు. మొత్తం వ్యవహారంపై ఆవేదనతో ఈ విషయాన్ని తన సహ ఉద్యోగినులతో చెప్పి.. వాపోయిన ఉద్యోగినికి మిగతావారంతా అండగా నిలిచారు. ఆఫీసరు రూము వద్దకు వెళ్లి అతన్ని చితకబాదారు.

వైరల్ అయిన కాల్..

తనతో రిలేషన్ అంటూ పదేపదే ఒత్తి పలుకుతున్న అధికారి మాటలను ఆమె రికార్డు చేయగా.. ఇప్పుడీ ఆడియో కాల్ వైరల్ (Viral) అవుతోంది. మొత్తం వ్యవహారంపై స్పందించిన జోధ్ పూర్ మునిసిపల్ కార్పొరేషన్ ధర్మేంద్ర గెహ్లాట్ అనే శానిటేషన్ ఇన్స్పెక్టర్ ను (sanitation inspector) సస్పెండ్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతోపాటు ధర్మేంద్రను మహిళా ఉద్యోగులు చితక బాదుతున్న వీడియో కూడా ఇప్పుడు రాష్ట్రమంతా వైరల్ గా మారింది. విశాఖా గైడ్లైన్స్the Vishaka Guidelines ప్రకారం మొత్తం తతంగంపై విచారణకు ఆదేశించారు.

ఇదీ చదవండి... పెళ్లికి ముహుర్తాలు లేవన్న పెద్దలు.. అలకతో ఉరేసుకున్న యువకుడు.. నిజామాబాద్ లో దారుణం

కొన్నేళ్లుగా ఇదే తంతు..

వితంతువైన ఈమెను గత కొన్నేళ్లుగా గెహ్లాట్ వేధిస్తున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆదివారం తన సోదరుడికి ఆరోగ్యం బాలేదని, అతని పరిస్థితి ఐసీయూలో సీరియస్ గా ఉందని, సెలవు కావాలని ఆమె అడిగిన తక్షణం మరోమారు ఆ అధికారి ఇలా డిమాండ్ చేసినట్టు పోలీసులు వివరించారు.
Published by:Srinivas Munigala
First published: