హోమ్ /వార్తలు /క్రైమ్ /

Wife And Husband: వీడెవడండి బాబు.. కోపంతో భార్య ముక్కు కోసేశాడు.. కారణం ఏంటో తెలుసా..

Wife And Husband: వీడెవడండి బాబు.. కోపంతో భార్య ముక్కు కోసేశాడు.. కారణం ఏంటో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Wife And Husband: ఓ వివాహిత తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్తానని తన భర్తకు చెప్పింది. దీంతో అతడు దారుణానికి పాల్పడ్డాడు. ఏం చేశాడో తెలుసా.. కోపంతో భార్య ముక్కును కోసేశాడు. ఈ రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలిలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు, ఆత్మహత్యలు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో(Video) తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై(Minor Girls) అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అంతే కాకుండా దేశంలో రోజురోజుకూ గృహ హింసకు సంబంధించిన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా రాజస్తాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టింటికి వెళతానన్న భార్యపై.. ఓ భర్త దారుణంగా దాడిచేశాడు.

దారుణ ఘటన.. ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి.. అత్యాచారం, హత్య చేశాడో యువకుడు.. మృతదేహాన్ని చాపలో చుట్టి..


అంతటితో ఆగకుండా ఆ మహిళ ముక్కు కోశాడు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని(Rajastan) జోధ్‌పూర్‌లో(Jodhpur) చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం బాధితురాలు కుటుంబసభ్యులతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం భార్యపై దారుణంగా దాడి చేసిన భర్తపై జాన్వార్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సబ్ ఇన్‌స్పెక్టర్ కమల్ సింగ్ ఇలా చెప్పారు. రాజస్థాన్ లోని లునావాస్ గ్రామానికి చెందిన భూమా రామ్‌కి పూనమ్ దేవి (25) కి కొన్నెళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో పుట్టింటికి వెళతానని భార్య కొన్ని రోజుల నుంచి భర్త భూమాను కోరుతోంది. దీంతో వారి మధ్య మాటల గొడవ మొదలైంది. పూనమ్ తన తల్లిదండ్రులను పరామర్శించిందేకు వెళ్లి తీరాల్సిందే అని భీష్మించుకు కూర్చుంది. అయితే ఆమె భర్త కొన్ని రోజుల తర్వాత వెళ్లు.. కానీ ఈ రోజు వద్దని ఆమెతో అన్నాడు.

ఈ రోజు కాకుండా మరో రోజు వెళ్తే తనతో పాటే భూమా కూడా వస్తానని చెబుతాడు. కానీ ఆమె ఏమాత్రం భర్త చెప్పిన మాట వినలేదు. కానీ ఆమె పుట్టింటికి వెళ్లాల్సిందే అంటూ మంకు పట్టు పట్టింది. దీంతో అతడు కోపోద్రిక్తుడు అయ్యాడు.  క్షణికావేశంలో పక్కనే ఉన్న కత్తి తీసుకొని ఆమె ముక్కును కోసేశాడు. దీంతో గమినంచిన ఇరుగుపొరుగు వాళ్లు ఆసుపత్రికి తరలించారు. ఆమె జరిగిన విషయాన్ని తన సోదరుడికి చెప్పింది. ఆమెకు ప్రథమ చికిత్స అందించిన తర్వాత మహిళను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

Crime News: హోటల్ గదిలో బాలికపై సామూహిక అత్యాచారం.. నిందితుల్లో ఒకరు బీజేపీ లీడర్.. చివరకు ఏమైందంటే..


ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను తన సోదరుడు.. ఇతర కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి భూమాపై ఫిర్యాదు చేశారు. భూమాపై వివిధ భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతడిని అరెస్టు చేయడానికి పోలీసులు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. పూనమ్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. చీటికి మాటికి తన సోదరిపై దాడి చేయడం ఇదే మొదటిసారి కాదని.. భూమా అనేక సందర్భాల్లో తన సోదరిని శారీరకంగా మరియు మానసికంగా హింసించాడని తెలిపాడు.

First published:

Tags: Crime, Crime news, Rajastan, Wife, Wife and husband

ఉత్తమ కథలు