రేపిస్టు ఘాతుకం...యువతిని ఇంటర్వ్యూ అని హోటల్ గదిలోకి పిలిచి...మత్తు మందు ఇచ్చి..

ఓ వ్యక్తి ఆన్ లైన్ జాబ్ సైట్ ద్వారా పరిచయమై మంచి నెల జీతం ప్యాకేజీతో ఒక ప్రైవేట్ బ్యాంకులో హెచ్‌ఆర్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో బాధితురాలు అతడి మాటలు నమ్మింది.

news18-telugu
Updated: December 2, 2019, 9:50 PM IST
రేపిస్టు ఘాతుకం...యువతిని ఇంటర్వ్యూ అని హోటల్ గదిలోకి పిలిచి...మత్తు మందు ఇచ్చి..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఇంటర్వ్యూ అని హోటల్ రూములోకి పిలిచి ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడిన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బాధితురాలు ఉత్తర్ ప్రదేశ్‌లోని తన స్వగ్రామం నుంచి ముంబైకు వచ్చి ఉమెన్స్ హాస్టల్ లో నివాసం ఉంటోంది. కాగా ఇటీవల ఆమె ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసింది. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఆన్ లైన్ జాబ్ సైట్ ద్వారా పరిచయమై మంచి నెల జీతం ప్యాకేజీతో ఒక ప్రైవేట్ బ్యాంకులో హెచ్‌ఆర్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో బాధితురాలు అతడి మాటలు నమ్మింది. అంతేకాదు సెప్టెంబర్ 19న జుహులోని ఒక హోటల్‌లో ఇంటర్వూకు హాజరుకావాలని ఆమెకు ఫోన్ చేశాడు. బాధితురాలు గదిలోకి ప్రవేశించగానే ఇంటర్వ్యూ చేసే ముందు జ్యూస్ తాగమని ఆఫర్ చేశాడు. అయితే జ్యూస్ లో మత్తు మందు కలిపి ఉండటంతో ఆమె మత్తులోకి జారుకుంది.

ఇదే అదనుగా భావించి డోర్ లాక్ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే గదిలో బాధితురాలిని రెండు రోజుల పాటు బంధించి ఆమెపై పలుసార్లు లైంగికదాడి చేసి, బయట ఎవరికీ చెప్పవద్దని, చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అయితే బాధితురాలు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading