టెర్రరిస్టులతో రూ.12 లక్షలకు డీల్.. డీఎస్పీకి బిగుస్తున్న ఉచ్చు

రూ.12 లక్షల ఇస్తామనడంతో ఉగ్రవాదులను బనిహాల్ సొరంగాన్ని దాటించేందుకు అతడు సాయం చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. డీఎస్సీ వాహనంలో వెళ్తే ఎవరూ సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ ఆపరని స్కెచ్ వేశారు. కానీ తనిఖీల్లో ముగ్గురూ అడ్డంగా దొరికిపోయారు.

news18-telugu
Updated: January 13, 2020, 10:40 PM IST
టెర్రరిస్టులతో రూ.12 లక్షలకు డీల్.. డీఎస్పీకి బిగుస్తున్న ఉచ్చు
రూ.12 లక్షల ఇస్తామనడంతో ఉగ్రవాదులను బనిహాల్ సొరంగాన్ని దాటించేందుకు అతడు సాయం చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. డీఎస్సీ వాహనంలో వెళ్తే ఎవరూ సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ ఆపరని స్కెచ్ వేశారు. కానీ తనిఖీల్లో ముగ్గురూ అడ్డంగా దొరికిపోయారు.
  • Share this:
జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిస్టులతో పోలీస్ అధికారి చేతులు కలిపిన వ్యవహారం సంచలనం రేపుతోంది. డబ్బుల కోసం కక్కుర్తి పడి ఉగ్రవాదులకు సాయం చేసిన డీఎస్పీ దవీందర్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శనివారం ఉగ్రవాదులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి కీలక వివరాలను రాబట్టారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సయ్యద్ నవీద్ ముస్తాఖ్, టెర్రరిస్ట్ రఫీని బనిహాల్ టన్నెల్‌ను సురక్షితంగా దాటించేందుకు డీఎస్పీ డీల్ కుదుర్చుకున్నాడు. రూ.12 లక్షల ఇస్తామనడంతో ఉగ్రవాదులను బనిహాల్ సొరంగాన్ని దాటించేందుకు అతడు సాయం చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. డీఎస్సీ వాహనంలో వెళ్తే ఎవరూ సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ ఆపరని స్కెచ్ వేశారు. కానీ తనిఖీల్లో ముగ్గురూ అడ్డంగా దొరికిపోయారు.


శనివారం సాయంత్రం షోపియన్‌లో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. రోడ్డుపై తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారులో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు వాంటెడ్ టెర్రరిస్టులు కనిపించారు. వారి పక్కనే దవీందర్ సింగ్ అనే డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారి ఉన్నాడు. ముగ్గురూ కలిసి కారులో ప్రయాణిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు.తానేతప్పు చేయలేదని విచారణలో డీఎస్పీ దవీందర్ సింగ్ బుకాయిస్తున్నాడు. పోలీసుల వద్ద లొంగిపోవడం కోసమే టెర్రరిస్టులను తీసుకెళ్తున్నానని.. అంతేతప్ప వారితో చేతులు కలపలేదని దేవేందర్ సింగ్ తెలిపాడు. ఐతే ఉగ్రవాదులను ప్రత్యేకంగా విచారించిన అధికారులు.. అసలు వారి మధ్య సరెండర్ గురించి చర్చ జరగలేదని గుర్తించారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులతో డీఎస్పీకి సంబంధాలు ఉన్నాయని అంచనాకు వచ్చారు. కొన్ని రోజులుగా డీఎస్పీ వ్యవహారంపై డిపార్ట్‌మెంట్‌లో అనుమానముంది. ఈ క్రమంలోనే శనివారం స్పెషల్ ఆపరేషన్ చేపట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
First published: January 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు