హోమ్ /వార్తలు /క్రైమ్ /

Visakhapatnam : యువతిపై పెట్రోల్ పోసిన తెలంగాణ ప్రేమికుడు మృతి -కాలిన గాయాలతో ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో..

Visakhapatnam : యువతిపై పెట్రోల్ పోసిన తెలంగాణ ప్రేమికుడు మృతి -కాలిన గాయాలతో ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో..

వైజాగ్ పెట్రోల్ దాడి ఘటనలో నిందితుడు మృతి

వైజాగ్ పెట్రోల్ దాడి ఘటనలో నిందితుడు మృతి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ‘యువతిపై పెట్రోల్ దాడి’ ఘటన విషాదంగా మారింది. విశాఖపట్నం సిటీలోని సూర్యాబాగ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటనలో నిందితుడు హర్షవర్ధన్ రెడ్డి చనిపోయాడు. నిందితుడు హర్షవర్ధన్ మంగళవారం ఉదయం కన్నుమూయగా, బాధిత యువతికి చికిత్స కొనసాగుతున్నది..

ఇంకా చదవండి ...

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ‘యువతిపై పెట్రోల్ దాడి’ ఘటన విషాదంగా మారింది. విశాఖపట్నం సిటీలోని సూర్యాబాగ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటనలో నిందితుడు హర్షవర్ధన్ రెడ్డి చనిపోయాడు. ఈనెల 13న యువతిపై పెట్రోల్ పోసిన హర్హవర్ధన్ తానూ నిప్పంటించుకోవడం తెలిసిందే. యువతి పెళ్లికి నిరాకరించిన కారణంగానే నిందితుడు దాడికి పాల్పడగా, పెట్రోల్ దాడిలో యువతి, ఆత్మహత్యాయత్నంతో యువకుడు ఇద్దరూ విశాఖలోని కేజీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. నిందితుడు హర్షవర్ధన్ మంగళవారం ఉదయం కన్నుమూయగా, బాధిత యువతికి చికిత్స కొనసాగుతున్నది..

విశాఖపట్నంలోని సూర్యాబాగ్ ప్రాంతంలో గల హోటల్ లో ఈనెల 13న(శనివారం) సాయంత్రం ఒక యువతి, మరో యువకుడు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలను చూసి అక్కడివారు షాకయ్యారు. హోటల్ సిబ్బంది, స్థానికులు తలుపులు తెరిచి వారిని కాపాడి, కేజీహెచ్ కు తరలించారు. ప్రేమ వ్యవహారమే దాడికి దారితీసినట్లు తర్వాత వెళ్లడైంది..

తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన హర్షవర్ధన్ రెడ్డి (21), విశాఖపట్నంలోని కరాస ప్రాంతానికి చెందిన యువతి(20) పంజాబ్ లో కలిసి ఇంజనీరింగ్ చదువుకున్నారు. బీటెక్ పూర్తిచేసి, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన హర్షవర్ధన్ కరోనా కారణంగా ఇంటి నుంచే పనిచేసేశాడు. తల్లిదండ్రులతో కలిసి భూపాల్ పల్లిలోని రెడ్డి కాలనీలో నివసించిన హర్షవర్ధన్ సడెన్ గా

భూపాలపల్లి నుంచి శుక్రవారమే విశాఖపట్నం వచ్చిన హర్షవర్ధన్ సూర్యాబాగ్ ప్రాంతంలోని హోటల్ లో దిగాడు. తాను ఎందుకొచ్చిందీ చెప్పడంతో స్నేహితురాలైన యువతి కూడా హోటల్ కు వెళ్లింది. వివాహం చేసుకోవాలని హర్షవర్ధన్ కోరగా, ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడై ఘాతుకానికి పాల్పడ్డాడు.

వెంట తెచ్చుకున్న బాటిల్ లోని పెట్రోల్ ను ముందుగా యువతిపై చల్లి నిప్పింటించిన హర్షవర్ధన్.. మిగిలిన పెట్రోల్ తనపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. హర్షవర్ధన్ కు 62 శాతం, యువతికి 61 శాతం కాలిలగాయాలతో ఇద్దరూ కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. హర్షవర్ధన్ మృతితో భూపాలపల్లిలోని రెడ్డి కాలనీలో విషాదం నెలకొంది.

Published by:Madhu Kota
First published:

Tags: Attack, Bhupalapally, Petrol, Visakhapatnam

ఉత్తమ కథలు