బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తోన్న పోలీసులు, నిందితుడు కృష్ణ
ప్రేమించలేదనే కోపంతో ఓ ఆటోడ్రైవర్ మైనర్ బాలిక(17) గొంతు కోసిన ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సోమవారం జరిగింది. ఇంట్లోకి చొరబడిమరీ అమ్మాయి గొంతు కోసిన తర్వాత ఆ ఉన్మాది తాపీగా కల్లు తాగుతూ స్థానికులకు పట్టుపపడ్డాడు.
ఆడపిల్లలపై అఘాయిత్యాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించలేదనే కోపంతో ఓ ఆటోడ్రైవర్ మైనర్ బాలిక(17) గొంతు కోసిన ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సోమవారం జరిగింది. ఇంట్లోకి చొరబడిమరీ అమ్మాయి గొంతు కోసిన తర్వాత ఆ ఉన్మాది తాపీగా కల్లు తాగుతూ స్థానికులకు పట్టుపపడ్డాడు. వెంకటగిరి పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలివి..
నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని కాలేజీమిట్టకు చెందిన బాలిక (17) ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ చెంచు కృష్ణ ప్రేమ పేరుతో ఆమెను కొంత కాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు యువకుడిని మందలించారు కూడా. వాడి జీవితం పాడైపోతుందనే చిన్న సంశయంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మందలింపుతో వదిలేయడమే ఇప్పుడు ఘోరానికి దారితీసినట్లయింది.
ప్రేమించడంలేదని, వెంటపడుతోన్న విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పిందని బాలికపై కోపం పెంచుకున్న చెంచుకృష్ణ.. సోమవారం ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న బాలికను గమనించాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అదే అదనుగా కత్తితో లోపలికి చొరబడి బాలిక గొంతు కోశాడు. ఆమె నెత్తుతి మడుగులో విలవిల్లాడుతుండగా సైకో డ్రైవర్ తాపీగా బయటికి కదిలాడు..
బాలిక గొంతు కోసిన తర్వాత చెంచుకృష్ణ చల్లగా కల్లు తాగి, తన ఇంటికి వెళ్లి తలుపులేసుకున్నాడు. గొంతు కోసుకుపోయిన గాయంతో పడిఉన్న బాలికను చుట్టుపక్కలవారు గుర్తించి, కుటుంబీకులకు కబురుపెట్టి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది చెంచుకృష్ణే అని గుర్తించిన స్థానికులు అతణ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ బాధిత బాలికకు వెంకటగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడు కృష్ణను అదుపులోకి తీసుకున్నామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఎస్సై కోటిరెడ్డి తెలిపారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.