మేనల్లుడితో ఆ సంబంధం... మహిళను నగ్నంగా చేసి..

అందరి ముందు ఆమె బట్టలన్నీ విప్పించి.. వివస్త్రను చేశారు. అంతేకాదు ఆమె జుట్టు కూడా కత్తిరించారు

news18-telugu
Updated: August 26, 2019, 8:38 AM IST
మేనల్లుడితో ఆ సంబంధం... మహిళను నగ్నంగా చేసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళకు దారుణ శిక్ష విధించారు గ్రామస్థులు. ఈ ఘటన జార్ఖండ్ దెన్‌గోఢి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆగష్టు 21న చోటు చేసుకున్న ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లైన ఓ మహిళ ... తన మేనల్లుడితో రాసలీలలకు దిగింది. భర్త లేని సమయంలో వీరిద్దరు వివాహేతర బంధం కొనసాగించేవారు. ఈ విషయం ఊరి పెద్దలకు తెలసింది. దీంతో పంచాయితీ పెట్టిన గ్రామస్థులు మహిళకు భయంకరమైన శిక్షవిధించారు. అందరి ముందు ఆమె బట్టలన్నీ విప్పించి.. వివస్త్రను చేశారు. అంతేకాదు ఆమె జుట్టు కూడా కత్తిరించారు. అయితే ఇందులో తన తప్పేం లేదని ...మేనల్లుడు తనతో అలా ఉండాలని బ్లాక్ మెయిల్ చేసేవాడని ఆరోపించింది. మేనల్లుడు మాత్రం ఆమె వాదనను తోసిపుచ్చాడు. మహిళనే తనను బలవంతంగా ఈ సంబంధంలొకి లాగిందని ఆరోపించాడు.

దీంతో బాధిత మహిళను బయటకు ఈడ్చి... ఆమెను వివస్త్రను చేశారు. అందరి ముందు నగ్నంగా నిల్చోబెట్టారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని పంచాయతీ పెట్టిన పెద్దల్ని విచారించారు. ఈ ఘటనకు సంబంధించి 11 మందిపై కేసు నమోదు చేశారు. త్వరలో వారందర్నీ అరెస్ట్ చేస్తామని తెలిపారు.

First published: August 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు