హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఇది చదివితే నవ్వాలో.. ఏడ్వాలో కూడా తెలీదు.. ఇంత చిన్న విషయానికి మొగుడిని.. ఏంచేసిందంటే..

ఇది చదివితే నవ్వాలో.. ఏడ్వాలో కూడా తెలీదు.. ఇంత చిన్న విషయానికి మొగుడిని.. ఏంచేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jharkhand: కొత్తగా పెళ్లయ్యింది. కొన్ని రోజుల పాటు సరదగా గడిపారు. ఈ క్రమంలో గ్రామంలోని.. జాతరకు భార్యతో కలిసి వెళ్లాడు. అక్కడి నుంచి వచ్చాక ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

పెళ్లయ్యాక భార్యభర్తల మధ్య కొన్ని సార్లు గొడవలు జరుగుతుంటాయి. ఇరువురు పెరిగిన వాతావరణం.. పద్ధతులు, అలవాట్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దీంతో అడ్జెస్ట్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. కొంత మంది ఏవైన బేధాభిప్రాయాలు వస్తే.. ఇంట్లోనే మాట్లాడుకుని గుట్టుగా కాపురం చేసుకుంటారు. మరికొందరు మాత్రం.. తమ మధ్య గొడవలను (Family disputes)  పది మందిలో తీసుకెళతారు. దీంతో వారి పరువుతో పాటు.. ఇంటి వాళ్ల పరువు కూడా బజారున పడుతుంది. కొంత మంది పెళ్లికి ముందు పుట్టింట్లో ఉన్నట్లు, అత్తగారింట్లో కూడా అలానే ఉండాలని కోరుకుంటారు. తము చెప్పిందే నడవాలని మంకు పట్టు పడుతుంటారు. దీని వలన కొన్ని చోట్ల దంపతుల మధ్య గొడవలు జరుగుతాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. జార్ఖండ్ లో (Jarkhand) అమానుష ఘటన జరిగింది. జమ్ తారా జిల్లా జోర్భితా గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. భార్యభర్తలు ఇద్దరు జోర్భితా గ్రామంలో ఉంటున్నారు. ఈ క్రమంలో.. పుష్ప హెంబ్రోమ్ అనే మహిళకు ఇటీవల పెళ్లయ్యింది. అయితే... కొన్ని నెలల పాటు సంసారం బాగానే సాగింది. అయితే.. భార్యభర్తలిద్దరు సమీపంలో ఉన్న గోపాల్ పూర్ గ్రామంలో.. జాతరకు వెళ్లారు. అక్కడ.. పుష్ప హెంబ్రోమ్.. జీన్స్ ప్యాంట్ వేసుకుని వెళ్లింది. దీన్ని భర్తకు నచ్చలేదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు (disputes) జరిగాయి.

ఇంటికి వచ్చాక.. గొడవలు పీక్స్ కు వెళ్లాయి. దీంతో మాట మాట పెరిగింది. ఈ క్రమంలో పుష్ప.. కోపంలో.. భర్తను (Wife kills husband) కత్తితో పొడిచి హత్య చేసింది. ఆ తర్వాత.. ఇంట్లో నుంచి పారిపోయింది. తన కొడుకు రక్తపు మడుగులో ఉండటాన్ని కర్ణేశ్వర్ తుడు చూశాడు. వెంటనే స్థానికులకు తెలిపారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బాధితుడు మరణించాడు. కాగా, తన కోడలే, కొడుకును జీన్స్ విషయంలో గొడవ పడి చంపిందని అన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Crime news, Jarkhand, Murder case, Wife kills husband

ఉత్తమ కథలు