Home /News /crime /

JHARKHAND SUSPENDS BUREAUCRAT ACCUSED OF MOLESTED HARASSING IIT STUDENT PAH

ట్రైనీ ఇంజనీరింగ్ యువతికి లైంగిక వేధింపులు.. కలెక్టర్ పై సీరియస్ అయిన ప్రభుత్వం..

కలెక్టర్ సయ్యద్ రియాజ్ అహ్మద్ (ఫైల్)

కలెక్టర్ సయ్యద్ రియాజ్ అహ్మద్ (ఫైల్)

Jharkhand: ఖుంటీ కలెక్టర్ సయ్యద్ రియాజ్ అహ్మద్ పార్టీలో యువతి పై లైంగిక వేధింపుల పాల్పడిన ఘటన కలకలంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

జార్ఖండ్ , (Jharkhand) ఖుంటీ కలెక్టర్ మూడు రోజుల క్రితం అధికారిక పార్టీలో బాలికను లైంగికంగా వేధించాడు. ఒంటరిగా ఉన్న బాలిక వద్దకు వెళ్లి అసహాజంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిపోయిన బాలిక ఘటనపై తన కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ క్రమంలో పోలీసులు కలెక్టర్ పై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశారు.

ఒక ఉన్నతాధికారి ఈ విధంగా చేయడం పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా, ప్రభుత్వం.. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వేధింపులకు పాల్పడిన ఖుంటి కలెక్టర్ ను.. సయ్యద్ రియాజ్ అహ్మద్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో కలెక్టర్ ను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు విడుదయ్యాయి.



ఇదిలా ఉండగా  ఘటనపై పూర్తి వివరాలు..

కొందరు తమ హోదాను, అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. కొన్ని చోట్ల అధికారులు పనికోసం వచ్చిన మహిళలను.. తమ లైంగిక కోరికలు తీరిస్తేనే... కావాల్సిన పనిచేస్తామంటూ బేరమాడుతుంటారు. మరికొందరు అధికారులు.. బాధితుల బలహీనతలను ఆసరాగా చేసుకొని.. గెస్ట్ హౌస్ కు రావాలని, ప్రేమపేరుతో, పెళ్లి చేసుకొవాలని బెదిరిస్తుంటారు. ఇలాంటి లైంగిక వేధింపులకు చెందిన అనేక ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఘటన వెలుగులోనికి వచ్చింది.

జార్ఖండ్ లో (Jharkhand) దారుణ ఘటన జరిగింది. డిప్యూటి కమిషనర్ కార్యాలయం అధికారుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి విందు కార్యక్రమం జరిగింది. దీనికి జార్ఖండ్ కు చెందిన ఐఏఎస్ అధికారి, కొంత మంది ఇంజనీరింగ్ విద్యార్థినులు, మరికొంత మంది అతిథులు హజరయ్యారు. అందరు పార్టీలో హుషారుగా పాల్గోన్నారు. మద్యం తాగారు. అయితే, కలెక్టర్, విద్యార్థి సింగిల్ గా ఉండటాన్ని చూశాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమెను లైంగికంగా (harassment)  వేధించాడు.

అయితే, యువతి ఇంటికి వెళ్లి తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో సోమవారం.. తనపై  కలెక్టర్ లైంగిక వేధింపులకు (female harassment) పాల్పడ్డాడని ఖుంటీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై పార్టీలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. పార్టీకి వచ్చిన ఇతరులకు కూడా విచారించారు. ప్రాథమికంగా విద్యార్థినిపై లైంగిక వేధింపులు వాస్తవమేనని వారు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపినట్లు తెలిపారు
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Jharkhand, Posco case, Rape case

తదుపరి వార్తలు