నర్సింగ్ విద్యార్థినిలపై వారి ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారి సహానాన్ని పరీక్షించే పేరుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి విద్యార్థినిలు ఓ సామాజిక కార్యకర్తను ఆశ్రయించడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. జార్ఖండ్‌లోని ఖుంతి జిల్లాలో ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సింగ్ ఇనిస్టిట్యూట్‌లోని విద్యార్థినులపై ఆ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ బబ్లూ అలియాజ్ పర్వేజ్ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై విద్యార్థులు మాట్లాడుతూ.. " డైరెక్టర్ పర్వేజ్ మాతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఓపికను పరీక్షించే టెస్ట్ పేరిట తాకరాని చోట్ల తాకేవాడు. దుస్తుల లోనికి చేతులు పొనిచ్చేవాడు. చాలా కాలంగా అతడు నర్సింగ్ ట్రైనీలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి పనులు చేస్తున్నాడు" అని తెలిపారు.
ఈ వేధింపులు భరించలేని బాధిత నర్సింగ్ విద్యార్థినిలు సామాజిక కార్యకర్త లక్ష్మి బఖ్లాకు ఈ విషయం చెప్పారు. విద్యార్థినిలు చెప్పిన మాటల ఆధారంగా సామాజిక కార్యకర్త లక్ష్మి బఖ్లా గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలోనే స్థానిక బ్లాంక్ డెవలప్మెంట్ అధికారి ఆధ్వర్యంలో ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. బ్లాక్ డెవలప్మెంట్ అధికారితోపాటు లోక్ మహిళా థానాకు చెందిన బృందం ఆ నర్సింగ్ ఇనిస్టిట్యూట్‌ను సందర్శించింది.
అక్కడి పరిస్థితులను లోతుగా సమీక్షించారు. విద్యార్థినిలను, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు గమనించిన అంశాలకు సంబంధించిన నివేదికను ఖుంతి ఎస్పీ అశుతోష్ శేఖర్‌కు అందజేశారు. అనంతరం పోలీసులు ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌ను అరెస్ట్ చేశారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.