అత్తను చంపిన అల్లుడు.. అల్లుడిని చంపిన మామ.. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఒకే గ్రామంలో రెండు హత్యలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. తొలుత అత్తను అల్లుడు హత్య చేయగా.. ఈ విషయం తెలిసిన తర్వాత అల్లుడిని మామ హత్య చేశాడు.

 • Share this:
  ఒకే గ్రామంలో రెండు హత్యలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. తొలుత అత్తను అల్లుడు హత్య చేయగా.. ఈ విషయం తెలిసిన తర్వాత అల్లుడిని మామ హత్య చేశాడు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లాలోని కురుమ్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 23 ఏళ్ల రాజ్‌పాల్ ముండా నివాసం ఉంటున్నాడు. అయితే రాజ్‌పాల్.. అదే గ్రామంలో నివాసం ఉంటున్న తన అత్త 55 ఏళ్ల భిన్సారి దేవి మంత్రాలు చేస్తుందనే అనుమానం పెంచుకున్నాడు. ఇక, కొంతకాలంగా రాజ్‌పాల్ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురికావడంతో.. భిన్సారి ఏదో చేసి ఉంటుందని భావించాడు. ఆమె మరింతగా అనుమానం పెంచుకున్నాడు. తన కుటుంబ సభ్యులు ఆరోగ్యం మెరుగుపడాలంటే.. భిన్సారిని చంపాలనే నిర్ణయానికి వచ్చాడు.

  ఈ క్రమంలోనే భిన్సారి భర్త మాగ్‌దేవ్ ముండా పొలానికి వెళ్లిన సమయంలో అతడు వాళ్ల ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఒంటిరిగా ఉన్న భిన్సారిపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని స్థానికకులు.. పొలానికి వెళ్లిన మాగ్‌దేవ్ ముండాకు చేరవేశారు. దీంతో వెంటనే మాగ్‌దేవ్ ఇంటికి చేరుకున్నాడు. భార్యకు అలా జరగడంపై కోపంతో రగిలిపోయాడు. రాజ్‌పాల్‌ను ఇంటికి పిలిచి హత్య ఎందుకు చేశావని అడిగాడు. అందుకు రాజ్‌పాల్.. భిన్సారి మంత్రగత్తె అని చెప్పాడు.

  దీంతో మాగ్‌దేవ్ ఆవేశం మరింతగా పెరిగింది. క్షణాల్లోనే పదునైన ఆయుధంతో రాజ్‌పాల్‌ తలపై దాడి చేశాడు. దీంతో రాజ్‌పాల్ మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కురుమ్‌ఘర్ పోలీసులకు సమాచారం అందజేశాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. హత్య‌కు వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకన్నారు. రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాజ్‌పాల్‌ను హత్య చేసిన మాగ్‌దేవ్ ముండాను పోలీసులు అరెస్ట్ చేశాడు.
  Published by:Sumanth Kanukula
  First published: