Home /News /crime /

JHARKHAND 3 MEN GANGRAPE 50 YEAR OLD WIDOW BRUTALLY AND INJURE HER PRIVATE PARTS SRD

Gang Rape : నిన్న ఉత్తరప్రదేశ్.. నేడు జార్ఖండ్.. 50 ఏళ్ల మహిళపై దారుణ కీచక కాండ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gang Rape : దేశంలో ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై కీచక పర్వం కొనసాగుతూనే ఉంది. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు మృగాళ్ల కోరికలు విజృంభిస్తున్నాయి. వయస్సు తేడా లేకుండా చిన్న పెద్దా వ్యత్యాసం చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

    దేశంలో ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై కీచక పర్వం కొనసాగుతూనే ఉంది. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు మృగాళ్ల కోరికలు విజృంభిస్తున్నాయి. వయస్సు తేడా లేకుండా చిన్న పెద్దా వ్యత్యాసం చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
    దేశంలో వరుస నిర్భయ ఉదంతాలు మహిళ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో బదూన్ ఘటనను తలపించేలా 50 ఏళ్ళ మహిళపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. జార్ఖండ్‌ రాష్ట్రం చత్రాలోని హంటర్‌గంజ్ ప్రాంతంలో ఈ దారుణం వెలుగుచూసింది. గురువారం రాత్రి బహిర్భూమి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో వారి ఆగడాలు ఆగలేదు. ఆమె ప్రైవేట్ భాగాలలో స్టీల్ టంబ్లర్‌ను చొప్పించి మరీ మాటల్లో చెప్పలేని విధంగా దారుణంగా హింసించారు. అంతేనా ఈ విషయాన్ని బయటకు చెబితే భయంకరమైన పరిణామాలుంటాయని, చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు.

    అయితే, ఇంటి నుంచి వెళ్లిన బాధితురాలు..ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో, కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆమెను వెతకడానికి బయలుదేరిన కుటుంబ సభ్యులు ఆమెను రక్తపు మడుగులో పడి ఉండటం గుర్తించారు. వెంటనే ఆమెను హంటర్‌గంజ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి బీహార్‌లోని గయాలోని అనుగ్రా నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయస్థితిలో చికిత్స తీసుకుంటోందని వైద్యులు తెలిపారు.

    కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. సత్వరమే విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతామని ఎస్పీ రిషబ్‌ ఝా తెలిపారు. అయితే, ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Crime, Crime news, Gang rape, Jharkhand

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు