• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • JEWELLERS SON AND WIFE BRUTALLY MURDERED AND 17 KG GOLD ROBBED POLICE GUN DOWN SUSPECT SRD

Crime : దారుణం..ఇద్దర్నీ చంపి 17 కిలోల బంగారం దోపిడీ..చివరకు పోలీసులు..

Crime :  దారుణం..ఇద్దర్నీ చంపి 17 కిలోల బంగారం దోపిడీ..చివరకు పోలీసులు..

ప్రతీకాత్మక చిత్రం

Crime : తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. నలుగురు దుండుగులు రెచ్చిపోయారు. ఓ బంగారం వ్యాపారి కుటుంబ సభ్యులను హత్య చేయడమే కాకుండా..

  • Share this:
    తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. నలుగురు దుండుగులు రెచ్చిపోయారు. ఓ బంగారం వ్యాపారి కుటుంబ సభ్యులను హత్య చేయడమే కాకుండా..ఏకంగా 17 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..మయిళదుతురాయ్ జిల్లాలోని సిర్కాళీ రైల్వే రోడ్డులో నివసించే ధన్​రాజ్​(51).. బంగారం వ్యాపారం చేస్తూ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం ఓ నలుగురు దుండగులు అతడి ఇంట్లోకి ప్రవేశించి.. ధన్​రాజ్​ భార్య ఆశ(42), అతని కుమారుడు అఖిల్​(24)ను హత్య చేసి 17 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఎటువంటి ఆధారాలు దొరకకుండా సీసీటీవీ హార్డ్​డిస్క్​లను కూడా నిందితులు తీసుకువెళ్లారు. అయితే, ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే పోలీసులు నిందితుల్లో ఒకర్ని ఎన్ కౌంటర్ చేశారు. మిగతా ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వారు దోచుకున్న 17 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్థానికంగా ఈ ఉదంతం కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ఆధారంగా నిందితులను నార్త్ ఇండియన్స్‌గా గుర్తించారు.

    దుండుగులు కొన్ని రోజులుగా రెక్కీ నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా ధన్ రాజ్ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయ్. అంతే కాకుండా వ్యాపారి బంగారాన్ని ఎక్కువ మొత్తంలో ఇంట్లో భద్రపరుస్తాడని స్థానికులు అంటుండేవారు. ఈ విషయమే దుండుగులు ఇంత ఘోరానికి పాల్పడటానికి కారణమైంది. అంతేకాకుండా దుండుగుల దగ్గర మారణాయుధాలు ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు.
    Published by:Sridhar Reddy
    First published: