JEALOUS WITH GIRL FOR SEEING ANOTHER BOY JAIPUR YOUTH KILLS HER SU
అమ్మాయి వేరొక యువకుడితో మాట్లాడుతుందనే జలస్తో నడిరోడ్డుపై అతి దారుణంగా హత్య
ప్రతీకాత్మక చిత్రం
రాజస్తాన్లోని జైపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి ప్రవర్తన తనకు నచ్చకపోవడంతో ఓ వ్యక్తి తీవ్రంగా కలత చెందాడు. ఆ తర్వాత జలస్తో ఆమెను నడిరోడ్డుపై అతి కిరాతకంగా హత్య చేశాడు.
రాజస్తాన్లోని జైపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి ప్రవర్తన తనకు నచ్చకపోవడంతో ఓ వ్యక్తి తీవ్రంగా కలత చెందాడు. ఆ తర్వాత జలస్తో ఆమెను నడిరోడ్డుపై అతి కిరాతకంగా హత్య చేశాడు. వివరాలు.. ఓ యువతి శనివారం పరీక్షకు హాజరైంది. పరీక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చే సమయంలో ఓ వ్యక్తి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. నిందితుడు మొదట ఆ అమ్మాయిని కత్తితో పొడిచాడు.. అనంతరం అతి సమీపం నుంచి షూట్ చేశాడు. దీంతో ఆమె సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆ యువతి వేరొక యువకుడితో మాట్లాడం నచ్చకపోవడంతోనే అతడు ఈ దాడి చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ దాడి అనంతరం దాడి అనంతరం అక్కడున్నవారు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే ఆమె అప్పటికే అపస్మారక స్థితిలో వెళ్లింది. ఇద్దరు వ్యక్తులు యువతిని మధ్యలో ఉంచి వ్యక్తులు స్కూటిపై ఆస్పత్రికి తరలించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు.. ఆమె అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యలు తెలిపారు.
అయితే నిందితుడు.. ఆ అమ్మాయికి మధ్య ఏమైనా పరిచయం ఉందా లేక, అమ్మాయి తనకు దక్కదనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.