JAWAN WHO CAME FROM JHARKHAND FOR TELANGANA ELECTIONS FOUND DEAD IN PARIGI SK
ఎన్నికల విధుల్లో జవాన్ అనుమానాస్పద మృతి...పరిగిలో కలకలం
ప్రతీకాత్మక చిత్రం
చనిపోయిన జవాన్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందినట్లుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో తీవ్ర కలకలం రేగింది. ఎన్నికల విధుల కోసం వచ్చిన ఓ జవాన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. సోమవారం నుంచి అతడు కనిపించకుండాపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మల్లమోనిగూడ గ్రామ శివారులోని పంటపొలాల్లో జవాన్ మృతదేహం లభ్యమైంది. గ్రామస్తులు సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. చనిపోయిన జవాన్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందినట్లుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.