ప్రముఖ యువ రెజ్లర్ ఆత్మహత్య.. సైబర్ బెదిరింపులే కారణమా..

రోజూ వందకు పైగా మెస్సేజ్‌లు వస్తున్నాయనీ, అవి ఎంతో ఇబ్బందికి గురిచేస్తున్నాయని వాపోయింది. ‘ఈ జీవితాన్ని ఎంతో ఇష్టపడ్డాను. కానీ నేను చాలా బలహీనురాలిని. నన్ను క్షమించండి. ఈ జీవితాన్ని ఇంకా కొనసాగించాలనుకోవడం లేదు.

news18-telugu
Updated: May 24, 2020, 9:09 PM IST
ప్రముఖ యువ రెజ్లర్ ఆత్మహత్య.. సైబర్ బెదిరింపులే కారణమా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సైబర్ బెదిరింపులు తట్టుకోలేక జపాన్‌కు చెందిన యువ రెజ్లర్, నెట్‌ఫ్లిక్స్ రియాల్టీ షో సభ్యురాలు హనా కిమురా (22) ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త తెలిసిన ఆ దేశ రెజ్లింగ్ ఆర్గనైజేషన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానుల్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కిముర ప్రొఫెషనల్ రెజ్లర్‌గా మాత్రమే కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ఆదరణ పొందిన 'టెర్రస్ హౌస్' అనే రియాల్టీ షోలోనూ సభ్యురాలిగా ఉంది. ఈ షోలో భాగంగా ఒకే ఇంట్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు కలిసి జీవిస్తున్నారు. ఈ షోలో ఆమె ప్రవర్తనపై గత కొన్నిరోజులుగా వీక్షకుల నుంచి సైబర్ బెదిరింపులు ఎదుర్కొంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. కరోనా కారణంగా ఈ షో కొన్నిరోజులుగా నిలిచిపోయినప్పటికీ బెదిరింపులు మాత్రం ఆగలేదు. ఈ క్రమంలో బెదిరింపులను భరించలేకనే కిమురా ఆత్మహత్యకు పాల్పడినట్టు జపాన్ మీడియా చెబుతోంది.

అయితే, చనిపోయే ముందు కిముర ట్విట్టర్‌‌లో స్పందిస్తూ.. రోజూ వందకు పైగా మెస్సేజ్‌లు వస్తున్నాయనీ, అవి ఎంతో ఇబ్బందికి గురిచేస్తున్నాయని వాపోయింది. ‘ఈ జీవితాన్ని ఎంతో ఇష్టపడ్డాను. కానీ నేను చాలా బలహీనురాలిని. నన్ను క్షమించండి. ఈ జీవితాన్ని ఇంకా కొనసాగించాలనుకోవడం లేదు. మద్దతుగా నిలిచినవారందరికీ థ్యాంక్స్‌’ అంటూ పేర్కొంది. దీంతో పాటు ఇన్‌స్టాలోనూ చివరగా తన పిల్లితో తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఐ లవ్ యూ. క్షమించు’ అని క్యాప్షన్ పెట్టింది. కాగా, కిమురా ఆత్మహత్యతో అజ్ఞాత బెదిరింపులు, ద్వేషపూరిత మెస్సేజ్‌లను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కిమురా మృతి పట్ల రిటైర్డ్ రెజ్లర్, హాలివుడ్ నటుడు మిక్ ఫోలే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైబర్ బెదిరింపులు జీవితంలో భాగం కాకూడదంటూ పేర్కొన్నారు.
First published: May 24, 2020, 9:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading