తల్లి శవాన్ని 10 ఏళ్ల పాటు ఇంట్లోనే దాచిన మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ తన తల్లి శవాన్ని 10 ఏళ్ల పాటు ఫ్రీజర్‌లో దాచి ఉంచింది. ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే తల్లి మృతదేహాన్ని దాచి.. ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడింది.

 • Share this:
  ఓ మహిళ తన తల్లి శవాన్ని 10 ఏళ్ల పాటు ఫ్రీజర్‌లో దాచి ఉంచింది. ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే తల్లి మృతదేహాన్ని దాచి.. ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడింది. ఈ షాకింగ్ ఘటన జపాన్‌ రాజధాని టోక్యోలో చోటుచేసుకుంది. తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచి పెట్టిన 48 ఏళ్ల మహిళ యుమి యోషినోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. దాదాపు 60 ఏళ్ల వయసు ఉన్న యోషినో తల్లి మున్సిపల్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో ఆమె పేరుతో అపార్ట్‌మెంట్‌ను లీజుకు తీసుకుంది. అయితే ఆమె పదేళ్ల క్రితం మరణించిందని యోషినో తెలిపింది. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే తనను అపార్ట్‌మెంట్ నుంచి ఖాళీ చేస్తారమోనని భయపడినట్టు పేర్కొంది. దీంతో  ఆమె మృతదేహాన్ని దాచి ఉంచినట్టు వెల్లడించింది. ఎందుకంటే తన తల్లితో కలిసి గడిపిన ఇంటిని విడిచి వెళ్లడం తనకు ఇష్టం లేదని యోషినో తెలిపినట్టు స్థానిక మీడియో పేర్కొంది.

  ఇక, అద్దె చెల్లించకపోవడంతో జనవరి మధ్యలో ఆమె ఆ అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో యోషినో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది. అయితే అపార్ట్‌మెంట్‌ను శుభ్రపరచడానికి వచ్చిన ఓ క్లీనర్ గదిలోని ఫ్రీజర్‌లో దాచిన మృతదేహాన్ని కనుగొన్నాడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. బుధవారం అక్కడికి చేరుకున్న పోలీసులు ఫ్రీజర్‌లో దాచిని యోషినో తల్లి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తరలించారు. యోషినో తన నివాసం ఉన్న అపార్ట్‌మెంట్‌లోనే తల్లి మృతదేహాన్ని దాచి పెట్టిందనే కారణంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

  మరోవైపు శవ పరీక్ష ద్వారా యోషినో తల్లి మరణించిన సమయం, కారణాన్ని నిర్ధారించే అవకాశం లేదని వార్త కథనాలు వెలువడ్డాయి.
  Published by:Sumanth Kanukula
  First published: