Japan former PM Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని(Japan Former PM) షింజో అబే(67)పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆదివారం జపాన్ ఎగువ సభ(Upper House)ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నారా సిటీలో ఓ బహిరంగ సభలో షింజో అబే(Shinzo Abe) ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి ఆయనపై కాల్పులు జపాన్ వార్తా సంస్థ NHK తెలిపింది. దుండగుడు షింజో అబేపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడని,ఈ ఘటనలో షింజో ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయని తెలిపింది. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు జరిగినట్లు తెలిపింది.
కాల్పులు జరిగిన వెంటనే షింజో అబే కుప్పకూలిపోయారని,ఆ తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించగా ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, జపాన్ మాజీ ప్రధానిపై కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని NHK తెలిపింది.
????????????????❗️ — Japanese Media #NHK is broadcasting the moment that Japanese Former PM #ShinzoAbe was shot from behind.
— ★ GNI ★ GAIA NEWS INTERNATIONAL (@GaiaNewsIntl) July 8, 2022
Video does not show the shooter, just the puff of smoke from the gunshots pic.twitter.com/oahw5fV82P
కాగా,షింజో అబే...జపాన్ ప్రధానమంత్రిగా, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) అధ్యక్షుడిగా 2006 నుండి 2007 వరకు.. మళ్లీ 2012 నుండి 2020 వరకు పనిచేశారు.అబే 2005 నుండి 2006 వరకు జునిచిరో కొయిజుమీ ఆధ్వర్యంలో చీఫ్ క్యాబినెట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 2012లో కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. జపాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగాషింజో అబేకి రికార్డు ఉంది.
.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.