పవన్ కళ్యాణ్‌పై అసత్య ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు జనసేన ఫిర్యాదు..

Pawan Kalyan: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఇప్పుడు కాదు చాలా రోజులుగా కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 15, 2020, 7:22 PM IST
పవన్ కళ్యాణ్‌పై అసత్య ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు జనసేన ఫిర్యాదు..
పవన్ కళ్యాణ్ జనసేన (pawan kalyan)
  • Share this:
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఇప్పుడు కాదు చాలా రోజులుగా కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తనపై ఇంత జరుగుతున్నా కూడా ఎప్పుడూ పవన్ పెద్దగా పట్టించుకోలేదు. తనపై అసత్య ప్రచారం జరుగుతున్నా కూడా ఆయన స్పందించింది లేదు. వాళ్ల పాపాన వాళ్లే పోతారు.. వాళ్లను పట్టించుకుని అనవసరంగా మన సమయాన్ని వృథా చేసుకోలేం కదా అంటూ పవన్ చెప్తుంటాడు. అయితే పవన్ ఎంత సైలెంట్‌గా ఉన్నా కూడా జనసేన సైనికులు మాత్రం అలా లేరు.
పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు (pawan kalyan)
పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు (pawan kalyan)


పవన్‌పై అసత్య ప్రచారం చేస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోవాలి అంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసారు జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ విభాగం. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం ఘటనపై ధర్మ పోరాట చేసాడు పవన్ కళ్యాణ్. ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసారు.
పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు (pawan kalyan)
పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు (pawan kalyan)

పవన్ కళ్యాణ్ ఫోటోలను క్షుద్రపూజలు చేస్తున్న విధంగా చిత్రీకరించి.. అసభ్య పదజాలంతో దూషిస్తూ ప్రచారం చేస్తున్నారు. వాళ్ల వివరాలను పోలీసులకు అందించామని తెలిపారు జనసేన సైనికులు. వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
Published by: Praveen Kumar Vadla
First published: September 15, 2020, 7:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading