Home /News /crime /

JAMMU KASHMIR TEACHER SUSPENDED FOR THRASHING CLASS 4 STUDENT CASE FILED PAH

Shocking: దారుణం.. నాలుగో తరగతి పిల్లలను విచక్షణ రహితంగా కొట్టిన టీచర్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jammu kashmir: ఒక టీచర్ నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. వారిని తరగతి గదిలో విచక్షణ రహితంగా కొట్టాడు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారాన్ని రేపింది.

Teacher Suspended For Thrashing Class 4 Student: జమ్ముకశ్మీర్ లోని ఉపాధ్యాయుడు పసి పిల్లల పట్ల దారుణంగా వ్యవహరించాడు. చిన్న పిల్లలనే కనికరం లేకుండా వారిని తరగతిలో చితక్కొట్టాడు. దీంతో పిల్లల చేతికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోనికి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జమ్ములోని రాజౌరీ జిల్లలోని ప్రభుత్వ పాఠశాలలో నిస్సార్ అహ్మద్ అనే ఉపాధ్యాయుడు నాలుగవ తరగతి పిల్లలకు తరగతులను బోధిస్తున్నాడు. ఈ క్రమంలో అతను.. కొంత మందిని విచక్షణ రహితంగా కొట్టాడు. పిల్లల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు.

దీంతో ఈ సంఘటన వెలుగులోనికి వచ్చింది. ఈక్రమంలో.. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తు అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసును నమోదు చేశారు. టీచర్ ను అదుపులోనికి తీసుకొని విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది.

మధ్య ప్రదేశ్ లో ఒక కొడుకు తన తండ్రిని చంపాడు.

పూర్తి వివరాలు.. మధ్య ప్రదేశ్ లోని గుణా ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల వీరేంద్ర అనే యువకుడు 10 వ తరగతి చదువుతున్నాడు. అయితే, అతని తండ్రి దులిచంద్ అహిర్వార్ పదవ తరగతి ఫెయిల్ అయితే.. బడిత పూజ చేస్తానని చెప్పాడు. దీంతో అతను అప్పటి నుంచి భయపడిపోయడు. ఈ క్రమంలో వీరేంద్ర పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఇక తాను.. ఫెయిల్ అవుతానని భయపడిపోయాడు. తన తండ్రి తనను కొడతాడని తెగ ఒత్తిడికి గురయ్యాడు.

ఈ క్రమంలో ఏప్రిల్ 3న తండ్రి నిద్రలో ఉండగా.. అతడిని కత్తితో పొడిచి ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో అతను తొందరగా పారిపోవడాన్ని స్థానికులు గమనించారు. ఆ తర్వాత.. ఇంటికి వెళ్లి చూస్తే.. దులిచంద్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.

కానీ అప్పటికే అతను మృతి చెందాడు. ప్రస్తుతం బాలుడిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో తాను.. ఫెయిల్ అవుతాననే భయంతో కన్న తండ్రిని చంపేశానని తెలిపాడు. తన తండ్రి రోజు తనను తిట్టే వాడని.. పరీక్ష తప్పితే ఇంటి నుంచి గెంటేస్తానని అనే వాడని ఇలా చేశానని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. అసలు ఇతనికి ఇప్పటికీ పరీక్షలు జరగలేదు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Jammu and Kashmir, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు