Home /News /crime /

JAMMU KASHMIR ON CAMERA BUS WITH AMARNATH PILGRIMS RAMS TRUCK OVER A DOZEN INJURED PAH

అమర్ నాథ్ యాత్రలో మరో విషాదం.. ట్రక్కును ఢీకొన్న బస్సు.. 14 మందికి పైగా గాయాలు..

ట్రక్ ను ఢీకొన్న బస్సు

ట్రక్ ను ఢీకొన్న బస్సు

Jammu kashmir: అమర్ నాథ్ యాత్రకు, భక్తులతో బయలు దేరిన బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జమ్ముకశ్మీర్ లోని ఖ్వాజీగుండ్ వద్ద ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన బస్సు ట్రక్కును ఢీకొట్టింది.

Amarnath yatra 2022: అమర్​నాథ్  (amarnath) యాత్రలో ఊహించని ఘటన జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు..  జమ్ముకశ్మీర్ లో ఒక ట్రక్ ను ఢీకొట్టింది. కాగా, బస్సు.. శ్రీ నగర్ జమ్ముహైవే (Jammu kashmir) వద్ద ప్రయాణిస్తున్నప్పుడు.. ఖ్వాజీగుండ్​ వద్ద బస్సు వేగంగా వచ్చి .. రోడ్డును దాటుతున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ట్రక్కు ఒక్కసారిగా ముందుకు వెళ్లింది. అక్కడ ఉన్న వారు.. భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో 14 మంది వరకు యాత్రికులు గాయపడినట్లు సమాచారం.

వీరందరినీ స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నారు. మొత్తం 40 మంది యాత్రికులతో బస్సు.. బల్తాల్​ బేస్​ క్యాంప్​వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కాగా, రెండెళ్ల విరామం అనంతరం అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. గత వారం.. కొండ చరియలు విరిగి పడి, వరదలు వచ్చి అనేక మంది యాత్రికులు చనిపోయారు.



మరోవైపు కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మధ్య మధ్యలో అమర్ నాథ్ యాత్రకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం, బల్తాల్‌ మార్గాల్లో భక్తులు వెళ్లేందుకు స్థానిక సిబ్బంది అనుమతించడం లేదు. వర్షాలు తగ్గేవరకు యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇండో టిబెటన్ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) అధికారులు సమాచారం ఇచ్చినట్లు వారు తెలుస్తోంది.



ఇదిలా ఉండగా బీచ్ లో సరదాగా గడపటానికి వెళ్లిన వారు విగత జీవులుగా మారారు.

మహారాష్ట్రకు (Maharashtra) చెందిన శశికాంత్ మ్హమానే (42) అనే వ్యక్తి దుబాయ్ లోని ఓక కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, అతను తన భార్య పిల్లలు.. శృతి(9), శ్రేయస్ (6)లతో కలిసి ఒమన్ కు వెళ్లాడు. అక్కడ బీచ్ లో సరదాగా గడపాటానికి తన ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. అయితే, వారంతా సముద్రం దగ్గర బీచ్ లో (Oman beach) ఆడుకుంటున్నారు.

అక్కడ సముద్రం నుంచి బలమైన అలలు ఎగిసి పడుతున్నారు. పిల్లలు.. అత్యుత్సాహంతో సముద్రం దగ్గరకు వెళ్లారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ ఉవ్వెత్తున అలలు ఎగిసి పడ్డాయి. అప్పుడు.. ఈ అలల్లో పిల్లలిద్దరు చిక్కుకున్నారు. నీటి లోపలికి కొట్టుకుపోయారు. పిల్లలను కాపాడటానికి శశికాంత్ మ్హమానే ప్రయత్నించాడు. అతను కూడా నీళ్లలో కొట్టుకుపోయాడు.

దీంతో ఒడ్డున ఉన్న వారంతా భయపడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈత గాళ్లు వచ్చి రెస్క్యూ చేపట్టారు. అక్కడే ఉన్న మరో నీటి అలలను తన ఫోన్ లో రికార్డుచేస్తున్నాడు. దానిలో ఈ షాకింగ్ ఘటన రికార్డు అయ్యింది. ఈ క్రమంలో.. శశికాంత్ మ్హమానే, శ్రేయస్ శవాలు ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి. మరో బాలిక శవం కోసం అధికారులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనతో బీచ్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media)  వైరల్ గా (viral video)  మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Jammu kashmir, Road accident, Srinagar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు