హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఆత్మహత్య చేసుకున్న జమ్మూయూనివర్సిటీ అసోసియేషన్ ప్రొఫెసర్.. కారణం ఏంటంటే..

ఆత్మహత్య చేసుకున్న జమ్మూయూనివర్సిటీ అసోసియేషన్ ప్రొఫెసర్.. కారణం ఏంటంటే..

విచారణ చేపట్టిన అధికారులు

విచారణ చేపట్టిన అధికారులు

Jammu:  కొన్నిరోజులుగా ప్రొఫెసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థులు యూనివర్శీటి అధికారులకు ఫిర్యాదు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Jammu and Kashmir, India

జమ్మూకశ్మీర్ లో (Jammu and kashmir)  షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జమ్మూ యూనివర్శీటిలో క్యాంపస్ లోని విద్యార్థులు సైకాలజీ ప్రొఫెసర్ చందర్ శేఖర్ (45) లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, యూనివర్శీటి అధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయనతన కూతురు, భార్యతో కలిసి క్యాంపస్ లోని భవనంలో ఉంటున్నారు. ఈ క్రమంలో గదిలోకి వెళ్లిన ఆయన ఎంత సేపటికి బయటకు రాలేదు.

దీంతో భయపడిపోయిన భార్య , కూతురు పోలీసులకు కాల్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గదితలుపులు బద్దలు కొట్టి లోపలికిప్రవేశించారు. కానీ అప్పటికే ప్రొఫెసర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే ఆయనను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదాలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లోని (Uttar Pradesh) ఇటావా జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది.

భర్తనా రైల్వే స్టేషన్‌లో ఈరోజు తెల్లవారుజామున స్టేషన్ ప్లాట్‌ఫారమ్, రైల్వే ట్రాక్‌ల మధ్య పొరపాటున పొరపాటున పడి ఒక ప్రయాణికుడు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. రైళ్ల కింద నలిగి తప్పించుకున్న వ్యక్తి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా గ్యాప్ మధ్య పడిపోయినట్లు సమాచారం.

అతని సన్నగా ఉండటం కారణంగా, వెంటనే ఒకవైపు పడుకొని, తనను తాను రక్షించుకోగలిగాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. వీడియోలో, ప్రయాణీకుల కోసం చుట్టుపక్కలవారు ఉల్లాసంగా ఎదురుచూస్తున్నట్లు చూడవచ్చు. రైలు స్టేషన్ దాటగానే, అతను వెంటనే లేచి నిలబడి చేతులు ముడుచుకున్నాడు. ఈ సంఘటన ఈరోజు ఉదయం 9:45 గంటలకు రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ 2 వద్ద జరిగింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Jammu and Kashmir

ఉత్తమ కథలు