JAMMU AND KASHMIR POLICE SAYS 62 TERRORISTS KILLED SO FAR THIS YEAR 39 BELONG TO LET PVN
Terrorists Killed : చచ్చారు కొడుకులు..కశ్మీర్ లో 62 మంది ఉగ్రవాదులను లేపేసిన సైన్యం
కశ్మీర్ లోయలో భారత జవాlన్లు
Terrorists killed In Encounter : హతమైన 62 మంది ఉగ్రవాదుల్లో 47 మంది స్థానికులు కాగా 15 మంది విదేశీ ఉగ్రవాదులని తెలిపారు. హతులైన 62 మంది ఉగ్రవాదుల్లో 39 మంది లష్కర్ ఏ తోయిబా(LeT)కు చెందినవారని, 15 మంది జైషే మహ్మద్ కు, 6 మంది హిజ్బుల్ ముజాహిద్దీన్ కు, ఇద్దరు అల్-బదర్ కు చెందినవారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.
62 Terrorists killed In Jammu And Kashmir : జమ్ముకశ్మీర్ లో ముష్కరుల వేట కొనసాగుతోంది. కశ్మీర్ లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లలో ఉగ్రవాదులను లేపేస్తుంది సైన్యం. జమ్ముకశ్మీర్ లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో 62 మంది ఉగ్రవాదులు హతమయ్యారని జమ్ముకశ్మీర్(Jammu and Kashmir) పోలీసులు గురువారం ప్రకటించారు. హతమైన 62 మంది ఉగ్రవాదుల్లో 47 మంది స్థానికులు కాగా 15 మంది విదేశీ ఉగ్రవాదులని(Terrorists Kiled) తెలిపారు. హతులైన 62 మంది ఉగ్రవాదుల్లో 39 మంది లష్కర్ ఏ తోయిబా(LeT)కు చెందినవారని, 15 మంది జైషే మహ్మద్ కు, 6 మంది హిజ్బుల్ ముజాహిద్దీన్ కు, ఇద్దరు అల్-బదర్ కు చెందినవారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.
ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్ పర్యటన తర్వాత ఈ వివరాలను వెల్లడించారు. మోదీ పర్యటనకు ముందు ఉగ్రవాదుల గాలింపు చర్యలను తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. అయితే మానవ మేధస్సు, టెక్రాలజీ, కేంద్రీకృత కార్యకలాపాల వల్ల జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల ఉనికి గణనీయంగా తగ్గుతోందని విజయ్ కుమార్ తెలిపారు.
మరోవైపు,గత గురువారం పుల్వామాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే. మరణించిన ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కార్మికులు, స్థానికేతరులు, స్థానిక పౌరులపై దాడులకు పాల్పడ్డారని విజయ్ కుమార్ తెలిపారు. మరణించిన ఉగ్రవాదులను అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐజాజ్ హఫీజ్, షాహిద్ అయూబ్ గా గుర్తించినట్లు చెప్పారు. వీరిద్దరూ స్థానికులేనని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.