హోమ్ /వార్తలు /క్రైమ్ /

Bus accident: జమ్ము కశ్మీర్ లో ఘోరం.. లోయలో పడిన బస్సు.. 56 మందికి తీవ్ర గాయాలు..

Bus accident: జమ్ము కశ్మీర్ లో ఘోరం.. లోయలో పడిన బస్సు.. 56 మందికి తీవ్ర గాయాలు..

లోయలో పడిన బస్సు

లోయలో పడిన బస్సు

Shocking:  జమ్ముకశ్మీర్ లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలంలోనే ఒకరు చనిపోయారు. మరో 56 మందిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Bus accident at Nowsherat : దేశంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా, జమ్ముకశ్మీర్ లోని నౌషేరా బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఒకరు ఘటన స్థలంలోనే చనిపోయాడు. మరో 56 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు రాజౌరీ, నౌషేరా వద్ద ప్రమాదానికి గురైనట్లు సమాచారం. వీరిని జమ్ములోని జీయంసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బస్సులోయలో పడిన ఘటన ప్రస్తుతం తీవ్ర కలకంగా మారింది. నౌషేరా వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది.

బస్సులో దాదాపు.. 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. నిముషాల్లోనే.. తమ కళ్ల ముందు ఉన్న ప్రయాణికులు దూరంగా విసిరి వేయబడ్డారు. అదే విధంగా బస్సులోని సామానులు చిందర వందరగా మారిపోయాయి. ప్రమాదం జరగగానే స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానికులతో కలసి సహాయక చర్యలను ప్రారంభించారు. ప్రమాద స్థలంలోనే ఒకరు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

వీరిలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. డ్రైవర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడిపాడా.. లేదా.. మద్యం సేవించాడా.. లేక బ్రేకులు ఫెయిలయ్యాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమతోటి ప్రయాణికులు కళ్ల ముందే హాహా కారాలు పెడుతుండటం అక్కడి వారిని కన్నీళ్లు పెట్టించింది.

First published:

Tags: Jammu and Kashmir, Road accident

ఉత్తమ కథలు