Home /News /crime /

JALANDHAR 2 STUDENTS FALL OFF HOSTEL BUILDING DURING FIGHT OVER BDAY PARTY CONTRIBUTION 1 DEAD OTHER CRITICAL PAH

OMG: కొంప ముంచిన బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్.. ఒకరు మృతి.. మరోకరు..

విచారణ చేపట్టిన అధికారులు

విచారణ చేపట్టిన అధికారులు

Punjab: హస్టల్ లో తోటి విద్యార్థి బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలను కున్నారు. దీని కోసం కొంత మంది విద్యార్థులు అందరి వద్ద డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు.

కొంత మంది డబ్బులను చాలా పొదుపుగా ఉపయోగిస్తారు. పార్టీలకని, సినిమాలకని అసలు వెస్ట్ చేయరు. తమ డబ్బును జాగ్రత్తగా వాడుకుంటారు. కేవలం అవసరాలకు, పుస్తకాలకు, ఏదైన కొర్సులు నేర్చుకొవడానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు. అయితే, మరికొందరు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. తాగుడుకు, తిరుగుళ్లకు, షికార్లకు డబ్బులను దుబారా చేస్తుంటారు. ఇష్టమోచ్చినట్లు డబ్బులను నీళ్లమాదిరిగా ఖర్చు చేస్తారు. అయితే, హస్టల్ లో, స్కూళ్లలో డబ్బుల విషయంలో కొన్ని సార్లు విద్యార్థుల మధ్య వాగ్వాదాలు, గొడవలు జరుగుతుంటాయి. కొన్ని సార్లు.. ఇవి లిమిట్ దాటి చంపుకునే వరకు వెళ్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. పంజాబ్ లోని (Punjab) దారుణమైన ఉదంతం జరిగింది. జలంధర్ లోని హస్టల్ లో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న హస్టల్ లో (Jalandhar 2 Students)  ఇతరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కలిసి ఉంటున్నారు. అయితే, తోటి విద్యార్థి బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేయాలను కున్నారు. అయితే, అప్పుడు కొంత మంది డబ్బులు ఇవ్వడంలో ( Bday Party Contribution) అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో కొంత మంది రెండు వర్గాలుగా విడిపోయారు.

హస్టల్ బంగ్లా మీదకు చేరుకున్నారు. అక్కడ.. బీహర్ కు చెందిన కిషన్ యాదవ్, అమన్ లు.. డిఎవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో కిషన్ యాదవ్ , అమన్ లు కొట్టుకున్నారు. ఇంతలో.. నెట్టుకొవడంతో ఇరువురు బిల్డింగ్ నుంచి కింద పడ్డారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మరణించాడు. మరోక యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఒక యువకుడు, ఆమె లవర్ ఇంటికి అర్థరాత్రి వెళ్లాడు.

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దారుణ ఘటన జరిగింది. బిలాస్ పూర్ లోని చిర్మిరి అనే గ్రామంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. ఆకాష్ సాహు అనే యువకుడు.. అదే గ్రామంలో ఉండే యువతిని ప్రేమించాడు. ఇద్దరు కలిసి ఉండే వారు. తరచుగా కలుసుకునే వారు. అయితే, అమ్మాయికి బిలాస్ పూర్ లో ఉద్యోగం వచ్చింది. దీంతో అబ్బాయితో మాట్లాడటం తగ్గించేసింది. ఈ క్రమంలో.. ఆకాష్ సాహు, అమ్మాయిపై కోపం పెంచుకున్నాడు. ఆదివారం నాడు.. చిర్మిరిలో ఒక మొబైల్ ఫోన్ దొంగిలించాడు. ఆ తర్వాత.. నేరుగా అమ్మాయి ఉంటున్న ఇంటికి వెళ్లాడు.

అప్పుడు రాత్రి 11 అవుతుంది. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరు వాదించుకున్నారు. దీంతో కోపంలో కంట్రోల్ తప్పాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో అమ్మాయి మణికట్టు మీద దాడి చేశాడు. చేతికి, గాయాలయ్యాయి. అమ్మాయి గట్టిగా కేకలు వేయడంతో అతను పారిపోయాడు. అమ్మాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Birthday, Crime news, Jalandhar, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు