హోమ్ /వార్తలు /క్రైమ్ /

పెళ్లైన మరుసటి రోజే వధువు మృతి.. కట్నం ఇవ్వలేదని విషం ప్రయోగం.. అత్తింట్లో అసలేం జరిగింది?

పెళ్లైన మరుసటి రోజే వధువు మృతి.. కట్నం ఇవ్వలేదని విషం ప్రయోగం.. అత్తింట్లో అసలేం జరిగింది?ఇక మైనారిటీల వివాహాలకు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద లక్ష రూపాయల నగదు సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందజేస్తుది. దివ్యాంగుల వివాహాలకు రూ. లక్షా 50వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఇక మైనారిటీల వివాహాలకు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద లక్ష రూపాయల నగదు సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందజేస్తుది. దివ్యాంగుల వివాహాలకు రూ. లక్షా 50వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపింది.

పసుపు రంగులో ఉన్న ద్రావణాన్ని ఆమె అత్త తీసుకొచ్చి అనుకృతికి ఇచ్చింది. ఏంటని అడిగితే.. గ్లూకోన్ డీ అని చెప్పారు. అది తాగిన కాసేపటికే అనుకృతి అస్వస్థతకు గురయింది. వాంతులయ్యాయి. స్పృహతప్పిపడిపోయింది

కూతురికి ఎంతో ఘనంగా పెళ్లి జరిపించారు. తమ స్థాయికి మించి డబ్బును ఖర్చు చేసి వివాహం చేశారు. మూడుముళ్లు పడిన తర్వాత.. హమ్మయ్య.. తమ బాధ్యత తీరిపోయిందని తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. అత్తింట్లో తమ కూతురు సుఖపడుతుందని భావించారు. కానీ పెళ్లైన మరుసటి రోజే షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. కాళ్ల పారాణి ఆరక ముందే ఆ నవ వధువు కన్నుమూసింది. ఏమైందో తెలియదు.. ఒక్కసారి అస్వస్థతకు గురైందని.. ఆస్పత్రికి తీసుకెళ్లినా.. కాపాడులేకపోయామని.. అల్లుడు ఫోన్ చేసి చెప్పడంతో.. ఆ తండ్రి గుండె బద్ధలయింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గత ఏడాది డిసెంబరులో ఈ దారుణం జరిగింది. ఐతే పోస్టుమార్టం రిపోర్టు ఇటీవలే వచ్చిది. అందులో సంచలన విషయాలు ఉన్నాయి.

పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. జైపూర్‌కు చెందిన అనుకృతి అనే యువతికి గత ఏడాది డిసెంబరు 6న వివాహం జరిగింది. కల్వార్ ప్రాంతానికి చెందిన యువకుడిని ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు వరుడు కుటుంబ సభ్యులు కట్నం డిమాండ్ చేశారు. వారు అడిగినట్లుగానే ఫ్రిజ్, టీవీ, ఏసీ, వాషింగ్ మెషిన్, ఫర్నిచర్‌తో పాటు పలు ఇతర వస్తువులను కట్నకానుకల కింద ఇచ్చారు. అంతేకాదు స్విప్ట్ డిజైర్ కారును కూడా అల్లుడికి గిఫ్ట్ ఇచ్చారు. వీటితో పాటు 20 లక్షల విలువైన బంగారం ఆభరణాలను చేయించారు. ఐతే వీటికి అదనంగా.. డబ్బు కూడా ఇవ్వాలని వరుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మొత్తం డబ్బు కట్నకానుకల కోసమే ఖర్చు చేశామని.. మళ్లీ నగదు ఇవ్వాలంటే.. ఎక్కడి నుంచి తీసుకురావాలని.. వధువు తండ్రి వాపోయాడు. డబ్బు ఇవ్వలేమని చెప్పాడు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. కానీ పెద్దలు నచ్చ జెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

కోట్ల రూపాయల మద్యం.. నడిరోడ్డుపై మంటల్లో దగ్ధం.. చూస్తుండగానే ఆవిరైపోయింది..

చివరకు డిసెంబరు 6న అనుకృతి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య ఘనగా పెళ్లి చేశారు. సాయంత్రం అప్పగింతల కార్యక్రమం జరిగింది. అదే రోజు సాయంత్రం అత్తింటికి వెళ్లిపోయిది. ఆ మరుసటి రోజు (డిసెంబరు 7) అత్తవారింట్లో పూజా కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం తర్వాత దాహంగా అనిపించడంతో ఏదైనా జ్యూస్ ఇవ్వాలని మరదలిని అడిగింది. అనంతరం పసుపు రంగులో ఉన్న ద్రావణాన్ని ఆమె అత్త తీసుకొచ్చి అనుకృతికి ఇచ్చింది. ఏంటని అడిగితే.. గ్లూకోన్ డీ అని చెప్పారు. అది తాగిన కాసేపటికే అనుకృతి అస్వస్థతకు గురయింది. వాంతులయ్యాయి. స్పృహతప్పిపడిపోయింది. నోటి నుంచి నురగల బయటకు వచ్చాయి.. అనుకృతి అస్వస్థతకు గురయిందని.. ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. పుట్టింటి వారు హుటాహుటిన ఆస్పత్రికి పరుగులు పెట్టారు. కానీ అప్పటికే అనుకృతి మరణించింది. పెళ్లైన మరుసటి రోజే కూతురు చనిపోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.

అన్నాదమ్ముళ్లకు ఒకే రోజు పెళ్లి.. మరుసటి రోజే కొత్త కోడళ్ల విశ్వరూపం.. మత్తు మందు ఇచ్చి..

అంత సడెన్‌గా ఎలా అస్వస్థతకు గురయిందని.. ఏదో జరిగిందని.. ఆమె తల్లిదండ్రులు అనుమానించారు. అత్త ఇచ్చిన పానీయం తాగిన తర్వాతే ఆమె ఆరోగ్యం విషమించిందని .. అందులో ఏదో కలిపారని అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం చేస్తే... అన్ని వివరాలను తెలుస్తాయని స్పష్టం చేశారు. కానీ పోస్టుమార్టం చేసేందుకు అత్తింటి వారు నిరాకరించారు. ఖచ్చితంగా చేయాల్సిందేనని.. వీరు పట్టుబట్టడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మూడు రోజుల క్రితం పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. ఆమెపై విషప్రయోగం జరిగినట్లు వెల్లడయింది. కట్నం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో.. అత్తామామలే విషం పెట్టారని.. మృతురాలి బంధువులు చెబుతున్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు. అత్తింటి వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

First published:

Tags: Crime news, Jaipur, Rajasthan

ఉత్తమ కథలు