హోమ్ /వార్తలు /క్రైమ్ /

Maoists Arrested: పోలీసుల అదుపులో ముగ్గురు నక్సలైట్లు.. ఆ పని చేస్తుండగా పట్టుకున్న పోలీసులు.. వివరాలివే..

Maoists Arrested: పోలీసుల అదుపులో ముగ్గురు నక్సలైట్లు.. ఆ పని చేస్తుండగా పట్టుకున్న పోలీసులు.. వివరాలివే..

మావోయిస్టులను మీడియాకు చూపుతున్న పోలీసులు

మావోయిస్టులను మీడియాకు చూపుతున్న పోలీసులు

మావోయిస్ట్ పార్టీలో (janashakti maoists) యువకులను రిక్రూట్‌మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోన్న ముగ్గురు నక్సలైట్ల (Naxalits)ను జగిత్యాల జిల్లా (jagtial district) కోరుట్ల (korutla ) పోలీసులు అరెస్ట్ చేశారు.

(న్యూస్ 18, తెలుగు కరస్పాండెంట్​, శ్రీనివాస్. పి)

జనశక్తి మావోయిస్ట్ పార్టీలో (janashakti maoists) యువకులను రిక్రూట్‌మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోన్న ముగ్గురు నక్సలైట్ల (Naxalits)ను జగిత్యాల జిల్లా (jagtial district) కోరుట్ల (korutla ) పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం జగిత్యాల జిల్లా కోనరావుపేట క్రాసింగ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబడినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ (sindhu sharma ips) మీడియాకు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, నిజమాబాద్ జిల్లాలో యువకులను జనశక్తి పార్టీలోకి చేర్చడం, వారికి ఆయుధాలు (Weapons), మందు గుండు సామగ్రి అందించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్పీ వెల్లడించారు.

శుక్రవారం తెల్లవారుజామున జనశక్తి సీనియర్ కేడర్ కూర రాజన్న (Koora Rajanna) నాయకత్వంలో పని చేస్తున్న ముగ్గురు ముఖ్యమైన జనశక్తి క్యాడర్​ నాయకులను పట్టు కున్నట్లు ఎస్పీ తెలిపారు. జనశక్తి గ్రూప్ క్యా డర్​ను రిక్రూట్ చేయడం , వారికి ఆయుధాలు , మందుగుండు సామగ్రిని అందించడం, వారిని జనశక్తి ఆర్మ్డ్ స్క్వాడా గా పని చేయడం ద్వారా భయాందోళనలు సృష్టించి డబ్బు దోపిడీ చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కుమ్మర్ పల్లి గ్రామానికి చెందిన పోహునుక సురేందర్ ( జనశక్తి సెంట్రల్ కమిటీ / టెక్ సభ్యుడు ), జగిత్యాల జిల్లా విద్యాపురికి చెందిన చెట్టి రాజేశ్వర్ (సభ్యుడు , కూర రాజన్నకు కొరియర్ ), సిరిసిల్లా జిల్లా తంగేళ్లపల్లికి చెందిన రవీందర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎస్పీ రెడ్డి పేరుతో నకిలీ ఐడీలు..

1997 లో మేడిపల్లి మండలం గోవిందారం గ్రామంలో జన శక్తితో పరిచయం ఏర్పడి పార్టీలో పని చేస్తున్న కూర రాజన్న ఆదేశాల మేరకు 1997 లో సురేందర్ జనశక్తి ఆగిపోయిన గ్రూపులో ఉన్నారని 2013 లో వేముల వాడ - సుద్దాల మధ్య జరిగిన కాల్పుల్లో హత్యకు గురైన ఆర్వో సుద్దాల ప్రభాకర్ రావు హత్యకేసులో ప్రధాన నిందితుడుని ఎస్పీ తెలిపారు.  పీఎస్పీ రెడ్డి పేరుతో హెదరాబాద్ సంధ్యానగర్ తన జీవితాన్ని ప్రారంభించాడు . ఎపీఎస్పీ రెడ్డి పేరుతో నకిలీ ఐడీలు సంపాదించాడు. మర్డర్లు , కిడ్నాప్ లు , దోపిడీలు వంటి ఘోరమైన నేరాలకు పాల్పడటం ఈ ఏడాది మార్చి నెలలో గున్నాల లక్ష్మణ్ కలిసి సిరిసిల్ల జిల్లా అక్కపల్లి- దర్మారం- పోతిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో జనశక్తి గ్రూపు పెద్ద ఎత్తున ప్లీనరీ నిర్వహించి భయాందోళనకు గురిచేశారని, సిరిసిల్లతోపాటు పరిసర ప్రాం తాల్లో ప్రచారం చేశారన్నారు ఎస్పీ .

మర్డర్​ ప్లాన్​కు పోలీసుల చెక్​..

2022 మార్చి 23 న గున్నాల లక్ష్మయ్య , నక్కా విజయ్ , దర్శనాల కిహన్ , బైనాల రవితో కలిసి వేములవాడ టౌన్​కు చెందిన ఆర్డీ అయ్యోరిపల్లి వంగల రాజమల్లయ్యను హతమార్చాలని అనుకున్నారని తెలిపారు. అయితే పోలీసులు అక్కడకు వచ్చి గున్నాల లక్ష్మణ్​ను పట్టుకోవడంతో అది కుదరలేదన్నారు . ఆ తర్వాత అతడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడని వీరి వద్ద రెండు పిస్టల్స్ , రెండు రివాల్వర్లు , పన్నెండు బోర్ తపంచాలు , 299 మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు . ఈ సమావేశంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి , సీఐ రాజశేఖర రాజు , ఎస్సైలు చిర్ర సతీష్ కుమార్ , శ్యామ్ రాజ్ , సుధీర్ రావు , రజిత , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .

First published:

Tags: Jagityala, Karimangar, Maoist, Naxals, Police

ఉత్తమ కథలు