అలా బ్లాక్‌మెయిల్ చేసి.. జడ్చర్ల బాలిక హత్య కేసులో నిజాలు..

Jadcharla Murder : ఇటీవల నవీన్ రెడ్డి బాలికను ప్రత్యక్షంగా కలవాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు.అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో.. చాటింగ్ స్క్రీన్ షాట్స్ బయటపెడుతానని బెదిరించాడు. దాంతో ఆమె ఒప్పకోక తప్పలేదు.

news18-telugu
Updated: August 30, 2019, 7:52 AM IST
అలా బ్లాక్‌మెయిల్ చేసి.. జడ్చర్ల బాలిక హత్య కేసులో నిజాలు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 30, 2019, 7:52 AM IST
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో పదో తరగతి విద్యార్థిని హత్య కేసులో పూర్తి వివరాలు వెలుగుచూశాయి.ఫేస్‌బుక్ ద్వారా ఆమెకు పరిచయమైన యువకుడే.. బాలికపై అత్యాచారయత్నం చేయబోయి.. ఆమె ప్రతిఘటించడంతో హత్యకు పాల్పడ్డాడు. హత్య తర్వాత రెండు రోజులకు కుళ్లిన స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా నేరం అంగీకరించాడు.

పోలీసుల కథనం ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో ఆ బాలిక(15) పదో తరగతి చదువుతోంది.కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌ శివారులోని కోహెడకు చెందిన ఏనుగు నవీన్ రెడ్డి అనే వ్యక్తితో ఆమెకు ఫేస్‌బుక్ పరిచయం ఏర్పడింది. నగరంలోని ఫోర్‌వీలర్ వీల్ అలైన్‌మెంట్‌లో అతను పనిచేస్తున్నాడు. ఫేస్‌బుక్‌లో ఇద్దరూ తరుచూ చాటింగ్ చేస్తుండేవారు. ఇదే క్రమంలో ఇద్దరూ ఫోన్ నంబర్స్ ఇచ్చి పుచ్చుకున్నారు.అలా ఇద్దరు చాలాసార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారు. అయితే ఇటీవల నవీన్ రెడ్డి బాలికను ప్రత్యక్షంగా కలవాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు.అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో.. చాటింగ్ స్క్రీన్ షాట్స్ బయటపెడుతానని బ్లాక్‌మెయిల్ చేశాడు. దాంతో ఆమె ఒప్పకోక తప్పలేదు.

అలా ఈ నెల 27న నవీన్ కారులో జడ్చర్లకు వెళ్లి.. అక్కడ ఆమెను కారులో ఎక్కించుకుని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో కోపోద్రిక్తుడై.. ఆమెపై తలపై బండరాయితో మోదాడు.ఆపై ఆమె చనిపోయిందని నిర్దారించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. బాలిక తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సీసీటీవి ఫుటేజీలో నవీన్‌తో వెళ్తున్నట్టు గుర్తించారు. 28న అతన్ని అరెస్ట్ చేసి విచారించగా నేరం అంగీకరించాడు. గురువారం ఉదయం కుళ్లిన స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. బిడ్డ మృతితో కన్నీరుమున్నీరవుతున్న ఆ తల్లిదండ్రులు.. నవీన్‌కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.First published: August 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...