ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో మరోసారి జబర్దస్త్ నటుడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జబర్దస్త్‌తో పేరు తెచ్చుకున్న హరి.. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో మరోసారి జబర్దస్త్ హరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హరికి ఎర్రచందనం స్మగర్లతో సంబంధాలు పెట్టుకున్నట్టు పోలీసులు గతంలో గుర్తించారు. అయితే తాజాగా మరోసారి అతడు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. శేషాచల అడవుల్లో అటవీ శాఖ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో.. నాగపట్ల, వెస్ట్ బీట్, చీకిమానుకోన దగ్గర 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పోలీసులు రెండు నాటు తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద పట్టుబడ్డ ఎర్రచందనం దుంగల విలువ రూ. 3 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జబర్దస్త్ హరికి ఈ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ హరి కోసం స్పెషల్ టీమ్స్ గాలింపు చేపట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఇక, గతంలో హరిపై స్మగ్లింగ్‌తో పాటు పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి అతన్ని చిత్తూరు జిల్లా పోలీసులు విచారించారు. హరి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి కోట్లు కూడగట్టాడని, తోటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ షకలక శంకర్ నటించిన శంభోశంకర చిత్రానికి ఫైనాన్స్ చేశాడని విపరీతమైన ప్రచారం జరిగింది.
గతంలో తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించిన హరి.. జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రమే స్మగ్లింగ్ చేసానని తెలిపాడు. ఓ కానిస్టేబుల్ అక్రమంగా ఎర్రచందం రవాణా చేస్తుంటే పోలీసులకు సమాచారం ఇచ్చానని.. అందుకే అతడు నాపై పగ పెంచుకుని పలురకాల తప్పుడు కేసులు పెట్టి తనని ఇరికించాడని హరి ఆరోపించాడు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.