పోలీసులు వస్తున్నారని పరిగెత్తి.. గుండె ఆగడంతో ప్రాణాలొదిలి..

గుంపులు గుంపులుగా చేరిన గ్రామస్తులు పోలీసులను చూసి ఒక్కసారిగా పరుగు అందుకున్నారు. జాఫర్(60) పోలీసులు వస్తున్నారనే భయంలో పరుగెత్తబోయి అక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు.

news18-telugu
Updated: April 11, 2020, 1:15 PM IST
పోలీసులు వస్తున్నారని పరిగెత్తి.. గుండె ఆగడంతో ప్రాణాలొదిలి..
లాక్‌డౌన్ వల్ల నిర్మానుష్యంగా మారిన రోడ్లు
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. కొంతమంది కావాలనే లాక్‌డౌన్ పాటించకుండా యథేచ్చగా బయట తిరుగుతున్నారు. దీంతో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడక్కడ తమ లాఠీలకు పని చెబుతున్నారు. అయితే ఓ వ్యక్తి పోలీసులు వస్తున్నారని భయపడి పరుగెత్తే క్రమంలో గుండి ఆగి చనిపోయాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో కొంతమంది గ్రామస్తులు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి యథేచ్చగా రోడ్లపై తిరుగుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గస్తీ పోలీసులు అటువైపుగా వెళ్లారు. గుంపులు గుంపులుగా చేరిన గ్రామస్తులు పోలీసులను చూసి ఒక్కసారిగా పరుగు అందుకున్నారు.

అదే గ్రామానికి చెందిన జాఫర్(60) పోలీసులు వస్తున్నారనే భయంలో పరుగెత్తబోయి అక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అయితే పోలీసులు వస్తున్నారన్న భయంతోనే పొలాల్లోకి పరుగెత్తబోయి కిందపడి మరణించాడని స్థానికులు చెబుతుండగా, అతను కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడుతున్నట్టు మృతుడి కొడుకు హుస్సేన్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు్ట తుళ్లూరు సీఐ శరత్ బాబు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమరావతి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లినట్టు అధికారులు చెప్పారు. ఇదిలావుంటే.. గుండెపోటుతోనే జాఫర్ మృతిచెందినట్టు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వివరించారు.
First published: April 11, 2020, 1:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading