హోమ్ /వార్తలు /క్రైమ్ /

Ivana Trump Dies : ట్రంప్ కుటుంబంలో విషాదం..ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ మృతి

Ivana Trump Dies : ట్రంప్ కుటుంబంలో విషాదం..ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ మృతి

మొదటి భార్య ఇవాన్ ట్రంప్ తో డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)

మొదటి భార్య ఇవాన్ ట్రంప్ తో డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)

Trump first wife dies : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ కన్నుమూసింది. న్యూయార్క్ నగరంలోని తన ఇంట్లో ఆమె మరణించినట్లు ఆమె కుటుంబం గురువారం ప్రకటించింది.

  Trump first wife dies : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్(Ivana Trump) కన్నుమూసింది. న్యూయార్క్ నగరంలోని తన ఇంట్లో ఆమె మరణించినట్లు ఆమె కుటుంబం గురువారం ప్రకటించింది. ఆమె వయసు 73 సంవత్సరాలు. ఇవానా ట్రంప్ తన మాన్‌హాటన్ ఇంట్లో మరణించినట్లు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తన సోషల్ మీడియా యాప్‌లో పోస్ట్ చేశారు. "ఆమె అద్భుతమైన, అందమైన,అమేజింగ్ ఉమెన్. ఆమె గొప్ప,స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపింది.మనమందరం ఆమె గురించి గర్విస్తున్నట్లుగా ఆమె వారి గురించి(తన పిల్లలు) చాలా గర్వపడింది"అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌ యాప్ లో  తెలిపారు.

  కాగా,డొనాల్డ్ ట్రంప్, ఇవానా ట్రంప్ 1977లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్‌. 1992లో వీరు తమ 15 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకొని విడాకులు ఇచ్చుకున్నారు. ఇవానా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ మాజీ భార్య మాత్రమే కాదు సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్ కూడా. 1980వ దశకంలో మీడియాలో ట్రంప్ క్రేజ్ పెరగడానికి ఇవానా కూడా కారణం. ఆమె ద్వారా న్యూయార్క్ సిటీలో పవర్ కపుల్స్‌గా వీరికి పేరు పడింది. మారియా మేపుల్స్‌తో డొనాల్డ్ ట్రంప్ ఎఫైర్ బహిరంగంగా రచ్చ రచ్చ అయిన తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ మారియా మేపుల్‌ను పెళ్లి చేసుకున్నారు.

  "ఇది చాలా విచారకరమైన రోజు, చాలా విచారకరమైన రోజు"అని ఎరిక్ ట్రంప్ తెలిపారు. ఇవాంకా ట్రంప్... తన తల్లి ఇవానా ట్రంప్ తో కలిసి నవ్వుతూ ఉన్న చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె తెలివైన, మనోహరమైన, ఉద్వేగభరితమైన వ్యక్తి అని అభివర్ణించింది. ఇవానా ట్రంప్ జీవితంలో పోరాడిందని, కమ్యూనిజం నుంచి ఆమె తప్పించుకుని ఈ దేశ పురోగతికి దోహదపడిందని ఇవాంక ట్రంప్  వివరించింది.

  Sri Lanka Crisis: శ్రీలంక సంక్షోభంలో కొత్త ట్విస్ట్.. కాబోయే అధ్యక్షుడు ఆయనేనా..?


  కాగా,ఇవానా ట్రంప్ తన ఇంట్లోని మెట్ల దగ్గర అపస్మారక స్థితిలో కనిపించిందని, మెట్లపై నుండి పడిపోయి ప్రమాదవశాత్తు ఆమె మరణించిందా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రంప్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న ఇద్దరు వ్యక్తులు తెలిపారు. కాగా,మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం ఆమె మరణానికి అధికారిక కారణాన్ని తెలియజేస్తుందని తెలిపారు.

  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Donald trump

  ఉత్తమ కథలు