Home /News /crime /

ITALIAN POLICE HUNT PAKISTANI FAMILY WHO STRANGLED 18 YEAR OLD GIRL TO DEATH SU

ఆ పాకిస్తానీ కుటుంబం కోసం వేట కొనసాగిస్తున్న పోలీసులు.. అసలు కారణమం ఏమిటంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ పాకిస్తానీ కుటుంబం కోసం ఇటాలియన్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కారణాలు తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే..

  ఓ పాకిస్తానీ కుటుంబం కోసం ఇటాలియన్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఆ కుటుంబాని చెందిన యువతిని హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్న అధికారులు.. వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. ఎందుకంటే ఆ యువతిని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కలిసి హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వారి చెప్పినట్టుగా పెళ్లికి అంగీకరించకపోవడంతో.. వారు ఈ పరువు హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. వివరాలు..18 ఏళ్ల సమన్ అబ్బాస్(Saman Abbas) కుటుంబం ఇటలీలో నివాసం ఉంటుంది. మే 1వ తేదీ నుంచి కనిపించడం లేదు. చివరి సారిగి.. సెంట్రల్ ఇటలీలోని రెగ్గియో ఎమిలియా నగరానికి సమీపంలోని పొలం వద్ద ఉన్న సీసీటీవీలో ఆమె కనిపించింది. అక్కడ ఆమె తండ్రి షబ్బర్ పనిచేసేవాడు. అయితే షబ్బర్.. సమన్ తల్లి నజీయా షహీన్, అంకుల్ హస్నైన్ డానిష్, కజిన్స్ నోమాన్‌ల్హాక్, ఇక్రమ్‌లతో కలిసి ఆమెను హత్య చేసేందుకు కుట్ర చేశారని పోలీసులు చెబుతున్నారు.

  సమన్‌కు ఇటలీలో ఒక ప్రియుడు ఉన్నాడు. ఆమె పాశ్యాత్య జీవనశైలి గడపాలని భావిస్తుండేది. అయితే సమన్ కుటుంబ సభ్యులను మాత్రం ఆమెను పాకిస్తాన్‌లోని బంధువుల అబ్బాయికి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నారు. అయితే ఇందుకు సమన్ నిరాకరించింది. ఈ విషయంపై ఇంట్లో గొడవ జరిగింది. దీంతో సమన్.. ఇంటి నుంచి పారిపోయింది. అక్టోబర్ నుంచి ఆమె భద్రత కోసం సామాజిక సంస్థల చేత నడపబడుతున్న ఆశ్రమంలో నివసించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 11న ఆమె తిరిగి ఇంటికి చేరింది. ఇంట్లోని తన గుర్తింపు పత్రాలను తీసుకెళ్లడానికి ఆమె ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 26 నుంచి సమన్ కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేయడానికి పథక రచన చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.

  ఏప్రిల్ 29న రాత్రి 7.30 గంటల సమయంలో హస్నైన్, నోమాన్‌ల్హాక్, ఇక్రమ్‌లు ముగ్గురు వెనక పొలాల్లోకి నడుస్తున్నట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ముగ్గురూ రెండు పారలు, ఒక బకెట్ మరియు నీలిరంగు బ్యాగ్‌ను వారితో పాటు తీసుకెళ్లారు. వారు సుమారు రెండు గంటలు సమయం అక్కడే గడిపారు. ఆ తర్వాత వారు ఇంటికి చేరారు. ఇక, మరుసటి రోజు.. సమన్.. బంధువులు తన హత్యకు ప్రణాళికలు చేస్తున్న విషయాన్ని విన్నట్టుగా ప్రియుడికి తెలియజేసింది. ఈ విషయాన్ని సమన్ తనకు మెసేజ్ చేసిందని ఆమె ప్రియుడు ఓ వార్త పత్రికకు వెల్లడించారు. ‘ఆమె నాకు మెసేజ్ చేయకుండా రెండు రోజులు గడిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పింది. అయితే నేను భరోసా ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆమెకు విశ్వాసం లేదని తెలిపింది’అని సమన్ ప్రియుడు తెలిపారు.

  ఈ కేసుకు సంబంధం ఉందనే అనుమానంతో ఇక్రమ్‌ను పోలీసులు ఫ్రాన్స్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని ఇటలీకి తీసుకొచ్చారు. ఇక, సమన్ తల్లిదండ్రులు షబ్బర్, నజియా.. ఆమెను హత్య చేశారనే ఆరోపణలను ఖండించారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న హస్నైన్ ఆచూకీ తెలియడం లేదని పోలీసులు తెలిపారు.

  మే 1 న అర్ధరాత్రి సమయంలో తల్లిదండ్రులు షబ్బర్, నజియాలు.. సమన్‌ను పొలం వెనుక ఉన్న పొలాల్లోకి నడిపిస్తున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిందని పోలీసులు తెలిపారు. ఈ జంట కేవలం 13 నిమిషాల తరువాత తిరిగి వచ్చింది. అక్కడ సమన్‌ను చంపిన తల్లిదండ్రులు.. ఆమెను పొలంలో ఎక్కడో చోట పాతిపెట్టాల్సిందిగా హస్నైన్, నోమాన్‌ల్హాక్, ఇక్రమ్‌లకు చెప్పినట్టుగా పోలీసులు తెలిపారు.

  పెళ్లయిన మహిళతో పెళ్లి.. కదులుతున్న రైల్లో కుంకుమ పెట్టి.. టాయిలెట్ పక్కన..

  వీడసలు మనిషేనా..? కూతురిని ఉద్యోగం పేరుతో హోటల్‌ రూమ్‌కు తీసుకెళ్లి..


  ఈ ఘటన జరిగిన తర్వాత షబ్బాస్, నజియా.. అనారోగ్య‌ంతో బంధువును చూడటానికి పాకిస్తాన్ వెళ్లారు. ఇక్రమ్ యూరప్‌కు వెళ్లారు. ఇక, మే 5న సమన్ కోసం వెతుకుతున్న కుటుంబ ఉన్నచోటుకు పోలీసులు వెళ్లినప్పుడు.. ఇంట్లో హస్నైన్, సమన్ 16 ఏళ్ల సోదరుడిని గుర్తించారు. వారు కుటుంబ సభ్యులు పాకిస్తాన్‌కు వెళ్లినట్టుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత హస్నైన్ ఆచూకీ కూడా కనిపించకుండా పోయింది. ఇక, ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, Italy, Murder, Pakistan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు