మాటలతో రేప్ చేశారు.. రెస్టారెంట్‌లో ముగ్గురి మహిళలకు చేదు అనుభవం..

రెస్టారెంట్‌లో కూర్చున్న 25 నిమిషాల పాటు అభ్యంతరకర వ్యాఖ్యలతో వెకిలి చేష్టలతో తీవ్రంగా వేధించారని వాపోయారు.

news18-telugu
Updated: September 22, 2019, 6:09 PM IST
మాటలతో రేప్ చేశారు.. రెస్టారెంట్‌లో ముగ్గురి మహిళలకు చేదు అనుభవం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇటీవల ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ముగ్గురు మహిళలకు చేదు అనుభవం ఎదురైంది.కొంతమంది యువకులు అభ్యంతరకర వ్యాఖ్యలు, అసభ్యకర చేష్టలతో తమను తీవ్రంగా ఇబ్బందిపెట్టారని వారు ఆరోపించారు. దీనికి సంబంధించి ఆ ముగ్గురు మహిళల్లో ఒకరు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. అందులో తమకు ఎదురైన చేదు అనుభవం గురించి వివరించారు. బాధితుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి 10.30గంటల ప్రాంతంలో సౌత్ ఢిల్లీలోని సైడ్‌కార్‌ రెస్టారెంట్‌లో ఈ ముగ్గురు డిన్నర్ చేసేందుకు వెళ్లారు. అక్కడ తమ వెనుక టేబుల్‌పై కూర్చున్న కొంతమంది యువకులు వారిపై అభ్యంతరకర కామెంట్స్ చేశారు. అంతేకాదు, అందులో ఓ యువకుడు వారి వైపు తన కుడి కాలు చూపిస్తూ బెదిరించాడని చెప్పారు.రెస్టారెంట్‌లో కూర్చున్న 25 నిమిషాల పాటు అభ్యంతరకర వ్యాఖ్యలతో వెకిలి చేష్టలతో తీవ్రంగా వేధించారని వాపోయారు. ఒకరకంగా మాటలతో తమను రేప్ చేశారని, ఆ మాటలకు తీవ్రంగా కుమిలిపోయామని అన్నారు. ఇక వాళ్ల వేధింపులను భరించలేక పోలీసులకు కాల్ చేయడంతో అక్కడి నుంచి పారిపోయారని చెప్పారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.
Published by: Srinivas Mittapalli
First published: September 22, 2019, 6:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading