బయటపడుతున్న కల్కి అవినీతి లీలలు.. ఆస్తులు చూసి ఐటీ అధికారుల షాక్

IT Raids on Kalki Bhagwan Ashram : మనీ లాండరింగ్,హవాలా,పన్ను ఎగవేత తదితర అక్రమ మార్గాల్లో కల్కి ఇన్ని ఆస్తులను కూడబెట్టినట్టు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు.

news18-telugu
Updated: October 18, 2019, 5:31 PM IST
బయటపడుతున్న కల్కి అవినీతి లీలలు.. ఆస్తులు చూసి ఐటీ అధికారుల షాక్
కల్కీ దంపతులు
  • Share this:
మహా విష్ణు అవతారం అని ప్రచారం చేసుకుని.. ఆధ్యాత్మిక ముసుగులో వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకున్న కల్కి,అలియాస్ విజయ్ కుమార్ నాయుడు లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.మొదట ఐదెకరాల స్థలంలో ప్రారంభమైన ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం.. ఆ తర్వాత వేల ఎకరాలకు విస్తరించింది.దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన ఆస్తులు కూడగట్టారు. దాదాపు 210 బినామీ కంపెనీలను నెలకొల్పి తీవ్ర అవినీతికి పాల్పడ్డాడు. కల్కితో పాటు ఆయన కొడుకు కృష్ణాజీ,ప్రీతీజి కూడా వందల ప్రైవేట్ లిమిటెడ్
కంపెనీలను నెలకొల్పారు. కల్కి ఆస్తుల మొత్తం విలువ ఇప్పుడు దాదాపు రూ.2లక్షల కోట్లు లేదా రూ.3లక్షల కోట్ల వరకు

ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మనీ లాండరింగ్,హవాలా,పన్ను ఎగవేత తదితర అక్రమ మార్గాల్లో కల్కి ఇన్ని ఆస్తులను కూడబెట్టినట్టు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు.
మొత్తం 400 మంది ఐటీ అధికారులు టీమ్స్‌గా విడిపోయి.. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,తమిళనాడులోని కల్కి ఆశ్రమాలు,ఆయనకు
సంబంధించిన ఇళ్లల్లో సోదాలు జరుపుతున్నారు. సోదాల్లో ఇప్పటివరకు రూ.40కోట్లు దొరికినట్టు సమాచారం. అలాగే రూ.10కోట్లు విలువ చేసే
బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.ఐటీ అధికారుల దాడులతో కల్కి దంపతులు అజ్ఞాతంలొకి జారుకున్నట్టు సమాచారం. వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమంలో ప్రధాన నిర్వాహకులైన లోకేష్ దాసాజీ,శ్రీనివాస్ దాసాజీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 25 ఏళ్ల క్రితం కల్కి ట్రస్టు ఏర్పాటు చేసినప్పటి నుంచి.. ఇప్పటివరకు ఆశ్రమ పేరును తరుచూ మార్చడానికి కారణాలేంటన్న దానిపై అధికారులు ఫోకస్ చేశారు. ట్రస్టు ఆస్తులు,బినామీలు,భూములకు సంబంధించిన పత్రాలతో కూడిన హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Published by: Srinivas Mittapalli
First published: October 18, 2019, 11:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading